Breaking News

నేను కోచింగ్ ఇచ్చిన అత్యుత్తమ ఆటగాడు అతడే: రవి శాస్త్రి

Published on Thu, 08/14/2025 - 18:04

విరాట్ కోహ్లి.. కెప్టెన్‌గా, ఆట‌గాడిగా త‌న పేరును భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించుకున్నాడు. కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్‌ను సాధించిక‌పోయిన‌ప్ప‌టికి భార‌త జ‌ట్టుకు ఎన్నో అద్బుత‌మైన విజ‌యాల‌ను అందించాడు.

అత‌డి నాయ‌క‌త్వంలోనే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. అంతేకాకుండా భారత జట్టును ఐదేళ్ల పాటు నంబర్ 1 జట్టుగా కోహ్లి నిలిపాడు. అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి కోహ్లి అద్బుతాలు చేశాడు. తాజాగా కోహ్లితో తన ప్రయణాన్ని గురించి రవిశాస్త్రి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కింగ్ కోహ్లిపై శాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు.

"నేను కోచ్‌గా పనిచేసిన అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్‌ కోహ్లి అగ్రస్ధానంలో ఉంటాడు. అతడొక అద్బుతమైన బ్యాటర్‌, లీడర్‌. భారత జట్టును రెడ్‌ బాల్ ఫార్మాట్‌లో నంబర్ వన్‌గా ఐదేళ్ల పాటు నిలిపాడు. ఆ ఐదేళ్ల‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ వంటి సేనా దేశాల్లో టీమిండియా చిర‌స్మ‌ర‌ణీయ విజయాల‌ను అందుకుంది.

అంతేకాకుండా అదే స‌మ‌యంలో విరాట్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా విదేశాల్లో అత్యద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. అత‌డు ఆడిన కొన్ని ఇన్నింగ్స్‌లు క్రికెట్ చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ నిలిచిపోతాయి. ధోని కెప్టెన్సీ నుంచి త‌ప్పుకొన్నాక కోహ్లిని భార‌త జ‌ట్టు సారథిగా ఎంపిక చేయాల‌ని నేను సూచించాను. 

బ్యాట‌ర్‌గా అత‌డికి ఉన్న స్కిల్స్‌, గేమ్ ప‌ట్ల మ‌క్కువ‌, ఆధిపత్యం చెలాయించే నైజం, క‌ష్ట‌ప‌డి ఆడ‌డం వంటి ఎన్నో లక్షణాలు న‌న్ను ఆక‌ట్టుకున్నాయి" అని ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ర‌విశాస్త్రి పేర్కొన్నాడు. 

కాగా 2017 నుంచి 2021 వరకూ ఈ వరల్డ్‌ కప్‌ విన్నర్‌ భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా సేవలందించాడు. ఇక కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టు క్రికెట్‌కు కోహ్లి వీడ్కోలు పలికి అందరికి షాకిచ్చాడు. తన టెస్టు కెరీర్‌ను 9230 పరుగులతో ఈ ఢిల్లీ బాయ్ ముగించాడు.
చదవండి: PAK vs WI: 'ఇక‌నైనా దేశం కోసం ఆడండి'.. పాక్ జ‌ట్టుపై షోయ‌బ్ అక్త‌ర్ ఫైర్‌
 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)