సెహ్వాగ్‌ కాదు!.. గావస్కర్‌ తర్వాత అతడే టెస్టు బెస్ట్‌ ఓపెనర్‌!

Published on Wed, 03/06/2024 - 17:48

టీమిండియా బౌలింగ్‌ విభాగం మాజీ కోచ్‌ భరత్‌ అరుణ్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. రవిశాస్త్రి దృష్టిలో సునిల్‌ గావస్కర్‌ తర్వాత అంతటి గొప్ప ఓపెనర్‌ మళ్లీ మురళీ విజయ్‌ అని పేర్కొన్నాడు. తనకు కూడా మురళీనే అభిమాన క్రికెటర్‌ అని తెలిపాడు.

కాగా 2008లో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ సందర్భంగా తమిళనాడుకు చెందిన మురళీ విజయ్‌ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లో వరుసగా 33, 41 పరుగులు సాధించాడు. ఓపెనర్‌గా సత్తా చాటి టెస్టు జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. 

కెరీర్‌లో మొత్తంగా 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో వరుసగా 3982, 339, 169 పరుగులు సాధించాడు మురళీ విజయ్‌. గతేడాది జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

తాజాగా మురళీ విజయ్‌ గురించి క్రికెట్‌.కామ్‌ ఇంటర్వ్యూలో భరత్‌ అరుణ్‌ మాట్లాడుతూ.. ‘‘యువకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు మురళీ విజయ్‌తో పరిచయం ఉంది.కాలేజీలో తనను మొదటిసారి చూశాను. ఫస్ట్‌ డివిజన్‌ జట్టుకు అతడి పేరును రికమెండ్‌ చేశాను. అలా అతడి ప్రయాణం మొదలైంది. రవిశాస్త్రి ఎల్లప్పుడూ నాతో ఓ మాట అంటూ ఉండేవాడు.

సునిల్‌ గావస్కర్‌ త​ర్వాత ఆ స్థాయిలో టెస్టుల్లో ఆకట్టుకున్న ఓపెనర్‌ మురళీ విజయ్‌ అని చెప్పేవాడు. నా ఫేవరెట్‌ క్రికెటర్‌ కూడా మురళీ విజయే’’ అని పేర్కొన్నాడు.  కాగా టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన దిగ్గజ బ్యాటర్‌  వీరేంద్ర సెహ్వాగ్‌, ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మలను కాదని.. గావస్కర్‌ తర్వాతి స్థానాన్ని రవిశాస్త్రి మురళీ విజయ్‌కు ఇవ్వడంపై నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: అప్పుడు పుజారాకు ఫోన్‌ చేశా.. రోహిత్‌, రాహుల్‌ భయ్యాకు థాంక్స్‌: అశూ భార్య

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)