Breaking News

టీ20 వరల్డ్ కప్‌లో 300 కొట్టే సత్తా వారికే ఉంది: రవి శాస్త్రి

Published on Fri, 01/30/2026 - 17:07

టీ20 ప్రపంచకప్‌-2026కి మరో వారం రోజుల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి శ్రీలంక, భారత్ వేదికలగా షురూ కానుంది. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో మొత్తం 20 జ‌ట్లు పాల్గోనున్నాయి. ఈ 20 జ‌ట్ల‌ను నాలుగు గ్రూపులుగా విభ‌జించారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్ల చొప్పున ఉంటాయి. భారత్‌, పాక్‌ గ్రూప్‌-ఎలో పోటీపడనున్నాయి.

ఆఖ‌రి నిమిషంలో బంగ్లాదేశ్ త‌ప్పుకోవ‌డంతో స్కాట్లాండ్‌కు ఐసీసీ అవ‌కాశ‌మిచ్చింది. భార‌త్ త‌మ తొలి మ్యాచ్‌లో ఫిబ్ర‌వ‌రి 7న యూఎస్ఎతో త‌ల‌ప‌డ‌నుంది.  సొంతగడ్డపై జరగనుండడంతో టీమిండియా ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.

అదేవిధంగా ర‌న్న‌ర‌ప్ సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి జ‌ట్లు కూడా ప‌టిష్టంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ హెడ్‌కోచ్ ర‌విశాస్త్రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ మెగా ఈవెంట్‌లో 300 పరుగుల భారీ మార్కును దాటే సత్తా ఉన్న జట్లు ఏవనే విషయంపై శాస్త్రి తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

"ఆస్ట్రేలియా, భార‌త జ‌ట్ల‌కు 300 ప‌రుగులు మార్క్ దాటే సత్తా ఉంది. ఈ రెండు రెండు జట్లలోనూ విధ్వంసం సృష్టించే ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్‌లో ఎవరైనా ఒకరు సెంచరీ సాధిస్తే, జట్టు స్కోరు 300కు చేరువవ్వడం కష్టమేమీ కాదు. ఇక భారత్ ఢిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. టైటిల్‌ను రిటైన్ చేసుకునేందుకు మెన్ ఇన్ బ్లూ ప్రయత్నిస్తుంది. 

అంతుకుతోడు ఈ టోర్నీ సొంతగడ్డపై జరగుతోంది. కాబట్టి భారత జట్టుపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. టీ20 ఫార్మాట్‌లో పది నుంచి పదిహేను నిమిషాలు ఆట మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది. ఆ సమయంలో భారత్ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుందన్నపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

అయితే భారత జట్టులో బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉంది. కాబట్టి బ్యాటింగ్ పరంగా పెద్దగా సమస్యలు తలెత్తకపోవచ్చు" అని ఐసీసీ రివ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో 300 పరుగులు పైగా చేసిన ఏకైక జట్టుగా ఇంగ్లండ్‌ కొనసాగుతోంది.
 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)