వెస్టిండీస్‌కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌

Published on Tue, 01/20/2026 - 14:33

ఇటీవలికాలంలో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు వెస్టిండీస్‌కు వరుసగా షాకులిస్తుంది. తాజాగా అదే సీన్‌ రిపీటైంది.దుబాయ్‌ వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘన్‌ జట్టు విండీస్‌పై 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. 

ఇబ్రహీం జద్రాన్‌ (56 బంతుల్లో 87 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), దర్విష్‌ రసూలీ (59 బంతుల్లో 84; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ అందించారు. వీరిద్దరూ చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 

ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్‌ డకౌట్‌ కాగా.. సెదిఖుల్లా అటల్‌ 2 పరుగులు మాత్రమే చేశాడు. విండీస్‌ బౌలర్లలో జేడన్‌ సీల్స్‌, మాథ్యూ ఫోర్డ్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం 182 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్‌ తడబడింది. జియా ఉర్‌ రెహ్మాన్‌ (4-0-36-3), రషీద్‌ ఖాన్‌ (4-0-19-2), ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (4-0-29-2), నూర్‌ అహ్మద్‌ (3-0-34-2) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది. 

విండీస్‌ ఇన్నింగ్స్‌లో సాంప్సన్‌ (30) టాప్‌ స్కోరర్‌గా కాగా.. జాన్సన్‌ ఛార్లెస్‌ (27), మోటీ (28), ఫోర్డ్‌ (25) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటరల్లో ఎవిన్‌ లూయిస్‌, బ్రాండన్‌ కింగ్‌ చెరో 4, జాంగూ, హెట్‌మైర్‌, పియెర్రీ తలో 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 రేపు (జనవరి 21) ఇదే వేదికగా జరుగనుంది.

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)