Breaking News

బాధ‌గా ఉంది.. కానీ ఇది ఆరంభం మాత్ర‌మే! ఎవ‌రనైనా ఓడిస్తాము: రషీద్‌

Published on Thu, 06/27/2024 - 18:36

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో అఫ్గానిస్తాన్ పోరాటం ముగిసింది. ఈ మెగా టోర్నీలో సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేస్తూ ప్ర‌త్య‌ర్ధి జ‌ట్ల‌ను భ‌య‌పెట్టిన అఫ్గాన్ జ‌ట్టు.. నాకౌట్ ద‌శ‌ను దాట‌లేక‌పోయింది. 

ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ట్రినిడాడ్ వేదిక‌గా జ‌రిగిన తొలి సెమీఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా చేతిలో 9 వికెట్ల తేడాతో అఫ్గాన్ ఘోర ఓట‌మి చ‌విచూసింది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫ‌ల‌మైన అఫ్గానిస్తాన్ కేవ‌లం 56 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 

అనంత‌రం 57 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ద‌క్షిణాఫ్రికా కేవ‌లం ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయి చేధించింది. ఈ విజ‌యంతో సౌతాఫ్రికా తొలిసారి ఫైన‌ల్లో అడుగుపెట్ట‌గా.. అఫ్గానిస్తాన్ ఇంటి బాట ప‌ట్టింది. ఇక ఈ ఓట‌మిపై అఫ్గానిస్తాన్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫ‌ల్యం కార‌ణంగానే ఓట‌మి పాలైమ‌ని ర‌షీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

"ఈ ఓట‌మిని మేము జీర్ణించుకోలేక‌పోతున్నాం. మేము బాగా ఆడటానికి ప్ర‌య‌త్నించాము. కానీ ఇక్క‌డి పిచ్ మాకు పెద్ద‌గా స‌హ‌క‌రించ‌లేదు. ఇక్క‌డి పరిస్థితులు బ్యాటింగ్‌కు చాలా క‌ష్టంగా ఉన్నాయి. అయితే మా ఓట‌మికి ఇదే నేను సాకుగా చెప్పాల‌నుకోవ‌డం లేదు. ప్ర‌స్తుత‌ టీ20 క్రికెట్ అంటే ఎలా ఉంటుందంటే అన్ని పరిస్థితులకూ మ‌నం సిద్ధంగా ఉండాలి.

సౌతాఫ్రికా బౌల‌ర్లు కూడా అద్బుతంగా బౌలింగ్ చేశారు. సెమీస్‌లో ఓడిపోయిన‌ప్ప‌ట‌కి ఈ టోర్నీలో మేము గొప్ప విజ‌యాలు సాధించాము.  ముజీబ్ ఆరంభంలోనే మా జ‌ట్టుకు దూర‌మైన‌ప్ప‌టికి మా సీమ‌ర్లు అత‌డి లోటును తెలియ‌జేయ‌లేదు. 

మా పేస‌ర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. న‌బీ కూడా కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఓవ‌రాల్‌గా ఈ టోర్నీని మేం బాగా ఆస్వాదించాం. టాప్ క్లాస్ జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా చేతిలో ఓట‌మిని నేను పూర్తిగా అంగీక‌రిస్తున్నాను. 

కానీ ఇది మాకు ప్రారంభం మాత్రమే. ఏ జ‌ట్టునైనా  ఓడించగలమన్న విశ్వాసం, నమ్మకం మాకు ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్ నుంచి చాలా విష‌యాలు నేర్చుకున్నామ‌ని"పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేష‌న్‌లో ర‌షీద్ పేర్కొన్నాడు.
 

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)