Breaking News

Viral Video: కళ్లు చెదిరే సిక్సర్‌ బాదిన రషీద్‌ ఖాన్‌

Published on Mon, 03/18/2024 - 15:13

ఐర్లాండ్‌తో నిన్న జరిగిన రెండో టీ20 ఆఫ్ఘనిస్తాన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లో ఇరగదీసిన రషీద్‌.. ఆతర్వాత బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 

రషీద్‌ (12 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్‌), మొహమ్మద్‌ నబీ (38 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సదీఖుల్లా అటల్‌ (32 బంతుల్లో 35; 2 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌తో రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. 

పై ముగ్గురు మినహా ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ రాణించలేకపోయారు. ఐర్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ అదైర్‌ 3, జాషువ లిటిల్‌, బ్యారీ మెక్‌కార్తీ తలో 2 వికెట్లు, బెంజమిన్‌ వైట్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌.. రషీద్‌ ఖాన్‌ (4-0-14-4), ఖరోటే (4-0-23-2), నబీ (3-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమై 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో బల్బిర్నీ (45), గ్యారెత్‌ డెలానీ (39) మాత్రమే రాణించారు. 

బంతిని చూడకుండానే సిక్సర్‌ బాదిన రషీద్‌..
ప్రపంచ స్థాయి బౌలర్‌ అయిన రషీద్‌ ఖాన్‌ అడపాదడపా బ్యాట్‌తోనూ ప్రతాపం చూపించడం తెలిసిందే. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో రషీద్‌ మరోసారి బ్యాట్‌తో తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ మ్యాచ్‌లో 18వ ఓవర్‌ ఆఖరి బంతికి రషీద్‌ బాదిన సిక్సర్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. బ్యారీ మెక్‌కార్తీ బౌలింగ్‌లో రషీద్‌ బంతిని చూడకుండానే సిక్సర్‌గా మలిచాడు. లెగ్‌సైడ్‌ దిశగా మెక్‌కార్తీ సంధించిన ఫుల్‌ టాస్‌ బంతిని రషీద్‌ కళ్లు మూసుకుని సిక్సర్‌ కొట్టాడు.

రషీద్‌కు ఇలాంటి షాట్లు ఆడటం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి షాట్లు చాలాసార్లు ఆడాడు. రషీద్‌ బాదిన ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఐర్లాండ్‌ తొలి మ్యాచ్‌లో గెలవగా.. ఆఫ్ఘనిస్తాన్‌ రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఇవాళ (మార్చి 18) జరుగనుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)