టెస్ట్‌ జట్టులో రషీద్‌ ఖాన్‌

Published on Mon, 12/16/2024 - 12:55

త్వరలో జింబాబ్వేతో జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం ఆఫ్ఘనిస్తాన్‌​ జట్టును ఇవాళ (డిసెంబర్‌ 16) ప్రకటించారు. ఆఫ్ఘన్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రషీద్‌ ఖాన్‌ చాలాకాలం తర్వాత టెస్ట్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రషీద్‌ తన చివరి టెస్ట్‌ మ్యాచ్‌ను 2021లో ఆడాడు. గజ్జల్లో గాయం కారణంగా రషీద్‌ టెస్ట్‌ మ్యాచ్‌లకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా సెలెక్టర్ల కోరిక మేరకు రషీద్‌ టెస్ట్‌ జట్టులో చేరాడు.

జింబాబ్వేతో టెస్ట్‌ సిరీస్‌ కోసం​ హష్మతుల్లా షాహిది నేతృత్వంలో 18 మంది సభ్యులతో కూడిన ఆఫ్ఘన్‌ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో ఏడుగురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో లెఫ్ట్‌ ఆర్మ్‌ సీమర్‌ బషీర్‌ అహ్మద్‌, ఆల్‌రౌండర్‌ ఇస్మత్‌ ఆలమ్‌ దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటారు.

మరో నలుగురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, ఫరీద్‌ అహ్మద్‌ మలిక్‌, రియాజ్‌ హసన్‌, సెదిఖుల్లా అటల్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌తో జరగాల్సిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌కు ఎంపికయ్యారు. ఆ మ్యాచ్‌ వర్షం, వెట్‌ ఔట్‌ ఫీల్డ్‌ కారణంగా ఒక్క రోజు కూడా సాగలేదు.

కాగా, ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లలో టీ20 సిరీస్‌ ఇదివరకే ముగిసింది. టీ20 సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్‌ 2-1 తేడాతో కైవసం​ చేసుకుంది. 

మూడు వన్డే మ్యాచ్‌లు డిసెంబర్‌ 17, 19, 21 తేదీల్లో జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ హరారే వేదికగా జరుగుతాయి. తొలి టెస్ట్‌ డిసెంబర్‌ 26 నుంచి.. రెండో టెస్ట్‌ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి బులవాయో వేదికగా జరుగుతాయి.

జింబాబ్వేతో రెండు టెస్ట్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు..
హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), రహ్మత్ షా (వైస్‌ కెప్టెన్‌), ఇక్రమ్ అలీఖైల్ (వికెట్‌కీపర్‌), అఫ్సర్ జజాయ్ (వికెట్‌కీపర్‌), రియాజ్ హసన్, సెదిఖుల్లా అటల్, అబ్దుల్ మలిక్, బహీర్ షా మహబూబ్, ఇస్మత్ ఆలం, అజ్మతుల్లా ఒమర్జాయ్, జహీర్ ఖాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్ , జహీర్ షెహజాద్, రషీద్ ఖాన్, యామిన్ అహ్మద్జాయ్, బషీర్ అహ్మద్ ఆఫ్ఘన్, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)