Breaking News

అవును నిజమే.. రెండో పెళ్లి చేసుకున్నా: రషీద్ ఖాన్‌

Published on Wed, 11/12/2025 - 13:25

అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని రషీద్ ఖాన్ స్వయంగా వెల్లడించాడు. రషీద్ ఇటీవల ‘ఖాన్ ఛారిటీ ఫౌండేషన్’ ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి రషీద్ ఖాన్‎ ఓ అమ్మాయితో హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. 

దీంతో ఎవరూ ఈ అమ్మాయి అన్న చర్చ నెట్టింట మొదలైంది. రషీద్ ఖాన్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడని.. రకరకాల ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఈ అఫ్గాన్‌​ స్టార్ స్పిన్నర్‌ తన రెండో పెళ్లి నిజమేనంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఊహాగానాలకు తెరదించాడు.

"2025 ఆగస్టు 2న నా జీవితంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. నన్ను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆమె నా జీవిత భాగస్వామి అయినం‍దుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇటీవల నా భార్యను ఒక ఛారిటీ ఈవెంట్‌కు తీసుకువెళ్లాను.

కానీ దురదృష్టవశాత్తు దీని గురించి ప్రజలు రకరకాల ఊహాగానాలను ప్రచారం చేశారు. ఆమె నా భార్య, ఇందులో దాచుకోవడానికి ఏమి లేదు. నాకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు" అని తన ఇన్‌స్టా ఖాతాలో రషీద్ పేర్కొన్నాడు.

కాగా రషీద్ గతేడాది అక్టోబర్‌లో పష్తూన్ ఆచారాల ప్రకారం రషీద్  మొదటి పెళ్లి జరిగింది. రషీద్  వివాహ వేడుకకు అఫ్గానిస్తాన్‌ క్రికెటర్లంతా హాజరయ్యారు. కానీ ఏడాది తిరగకుముందే వ్యక్తిగత కారణాల చేత వారిద్దరూ విడిపోయినట్లు సమాచారం.
చదవండి: రోహిత్ శ‌ర్మ అనుహ్య‌ నిర్ణ‌యం..! ఇక మిగిలింది కోహ్లినే?

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)