క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘటన.. వైరల్‌ వీడియో

Published on Wed, 12/10/2025 - 19:44

క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడిని ఔట్‌ చేసే అవకాశం ఉన్నా ప్రత్యర్ధి ఆటగాడు ఔట్‌ చేయకుండా వదిలేశాడు. దీనికి కారణం ఏంటంటే.. సదరు ఆటగాడు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇది గ్రహించిన ప్రత్యర్ది జట్టు వికెట్‌కీపర్‌ స్టంపౌట్‌ చేసే అవకాశమున్నా వదిలేశాడు.

విషయాన్ని అర్దం చేసుకున్న బ్యాటర్‌ తరఫున టీమ్‌, మరో బంతి చూసి ఆ ఆటగాడిని రిటైర్డ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు పిలిపించుకుంది. క్రికెట్‌ చరిత్రలో అరుదుగా జరిగే ఇలాంటి ఘటన ప్రస్తుతం జరుగుతున్న ఇంట్నేషనల్‌ టీ20 లీగ్‌-2025లో జరిగింది.

ఈ లీగ్‌లో భాగంగా నిన్న (డిసెంబర్‌ 9) డెజర్ట్‌ వైపర్స్‌-ఎంఐ ఎమిరేట్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో వైపర్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తుండగా.. ఆ జట్టు ఆటగాడు మ్యాక్స్‌ హోల్డన్‌ పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నాడు. 

ఇది గ్రహించిన ప్రత్యర్ది జట్టు వికెట్‌కీపర్‌ నికోలస్‌ పూరన్‌ స్టంపౌట్‌ చేసే అవకాశమున్నా హోల్డన్‌ను ఔట్‌ చేయలేదు. బంతిని కనెక్ట్‌ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్న హోల్డన్‌ మరికొద్ది సేపు క్రీజ్‌లో ఉంటే బంతులు వృధా చేయించవచ్చన్నది అతని ప్లాన్‌.

అయితే పూరన్‌ ప్లాన్‌ను పసిగట్టిన వైపర్స్‌  కెప్టెన్‌ ఫెర్గూసన్‌ హోల్డన్‌ను రిటైర్డ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు పిలిపించుకున్నాడు. ఈ తతంగం ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో జరిగింది. అప్పటికి వైపర్స్‌ స్కోర్‌ (118/1) చాలా తక్కువగా ఉండింది. హోల్డన్‌ క్రీజ్‌ను వీడాక కాస్త పుంజుకున్న వైపర్స్‌ స్కోర్‌ అంతిమంగా 159 పరుగులకు చేరింది.

ఈ స్వల్ప లక్ష్య ఛేదనలోనూ ఎంఐ ఎమిరేట్స్‌ తడబడింది. ఓ దశలో సునాయాసంగా గెలుస్తుందనుకున్న ఈ జట్టు ఒకే ఓవర్‌లో (19) మూడు వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి లోనై పరాజయంపాలైంది. ఆఖరి ఓవర్‌లో గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. రషీద్‌ ఖాన్‌ వరుసగా సిక్సర్‌, బౌండరీ కొట్టి లక్ష్యానికి చేరువ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

చివరి బంతికి 2 పరుగులు చేయాల్సిన దశలో అర్వింద్‌ అద్భుతమైన త్రోతో ఎంఐ పుట్టి ముంచాడు. తొలి పరుగు పూర్తి చేసే లోపే అర్వింద్‌ డైరెక్ట్‌ త్రోతో ఘజన్‌ఫర్‌ను రనౌట్‌ చేశాడు. దీంతో ఎంఐకి ఓటమి తప్పలేదు. 19వ ఓవర్‌లో 3 వికెట్లు సహా మ్యాచ్‌ మొత్తంలో 4 వికెట్లు తీసిన డేవిడ్‌ పేన్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)