Breaking News

ఆంధ్రతో రంజీ మ్యాచ్‌.. శతక్కొట్టిన హైదరాబాద్‌ ప్లేయర్‌

Published on Wed, 11/13/2024 - 17:33

హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా ఆంధ్రప్రదేశ్‌, హైదరాబాద్‌ మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ అజేయ సెంచరీతో (124) చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్‌ జట్టు 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. 

తన్మయ్‌ అగర్వాల్‌తో పాటు రాహుల్‌ రాధేశ్‌ (22) క్రీజ్‌లో  ఉన్నారు. హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో అభిరథ్‌ రెడ్డి 35, రోహిత్‌ రాయుడు 0, కొడిమెల హిమతేజ 26, రాహుల్‌ సింగ్‌ 1, కే నితేశ్‌ రెడ్డి 22 పరుగులు చేసి ఔటయ్యారు. ఆంధ్ర బౌలర్లలో త్రిపురణ విజయ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. లలిత్‌ మోహన్‌, యారా సందీప్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

కాగా, ప్రస్తుత రంజీ సీజన్‌లో ఆంధ్ర, హైదరాబాద్‌ జట్లు ఎలైట్‌ గ్రూప్‌-బిలో ఉన్నాయి. ఈ గ్రూప్‌లో హైదరాబాద్‌ ఆరో స్థానంలో ఉండగా.. ఆంధ్ర జట్టు ఆఖరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్‌లో గెలిచి, 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకోగా.. ఆంధ్ర ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడు పరాజయాలు ఎదుర్కొని, ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)