Breaking News

Ranji Trophy: పారస్‌ డోగ్రా సెంచరీ... విజయం దిశగా జమ్మూ కశ్మీర్‌

Published on Wed, 02/12/2025 - 07:43

పుణే: రంజీ ట్రోఫీ (Ranji Trophy) తాజా సీజన్‌లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న జమ్మూ కశ్మీర్‌ (Jammu And Kashmir) జట్టు కేరళతో క్వార్టర్‌ ఫైనల్లో భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 180/3తో మంగళవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన జమ్మూ కశ్మీర్‌ జట్టు 100.2 ఓవర్లలో 399/9 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. 

కెప్టెన్‌ పారస్‌ డోగ్రా (Paras Dogra) (232 బంతుల్లో 132; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కటి సెంచరీతో చెలరేగగా... కన్హయ్య (64; 5 ఫోర్లు), సాహిల్‌ (59; 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌సెంచరీలతో రాణించారు. కేరళ బౌలర్లలో నిదీశ్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 399 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కేరళ జట్టు మంగళవారం ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. 

రోహన్‌ (36), ఆక్షయ్‌ చంద్రన్‌ (32 బ్యాటింగ్‌), కెప్టెన్‌ సచిన్‌ బేబీ (19 బ్యాటింగ్‌) తలా కొన్ని పరుగులు చేశారు. జమ్మూ కశ్మీర్‌ బౌలర్లలో యుధ్‌వీర్‌ సింగ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 8 వికెట్లు ఉన్న కేరళ జట్టు విజయానికి ఇంకా 299 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఫలితం జమ్మూ కశ్మీర్‌కు అనుకూలంగా వస్తే చరిత్ర అవుతుంది. ఈ జట్టు తొలిసారి సెమీస్‌కు అర్హత సాధించినట్లవుతుంది.  

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)