Breaking News

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పడిక్కల్‌ విధ్వంసకర శతకం

Published on Sun, 02/01/2026 - 18:47

కర్ణాటక బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ దేశవాలీ క్రికెట్‌లో అరివీర భయంకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల విజయ్‌ హజారే వన్డే టోర్నీలో 9 ఇన్నింగ్స్‌ల్లో 90కి పైగా సగటుతో 4 సెంచరీల సాయంతో 725 పరుగులు చేసిన అతను.. తాజాగా రంజీ ట్రోఫీలో పంజాబ్‌పై విధ్వంసకర శతకంతో చెలరేగాడు. క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో పడిక్కల్‌ ఉగ్రరూపం దాల్చాడు. 

40 ఓవర్లలో 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 85 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 120 పరుగులు చేసి, తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో పడిక్కల్‌ కర్ణాటక కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సహా మ్యాచ్‌ను గెలిపించి చిరస్మరణీయం చేసుకున్నాడు. 

ఛేదనలో పడిక్కల్‌కు మయాంక్‌ అగర్వాల్‌ (53), శ్రేయస్‌ గోపాల్‌ (33) సహకరించారు. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ 13 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. పడిక్కల్‌ విధ్వంసకర శతక​ంతో కదంతొక్కడంతో కర్ణాటక 27.5 ఓవర్లలోనే (5 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్‌ బౌలర్లలో అన్మోల్‌జీత్‌ సింగ్‌ 3 వికెట్లు తీయగా.. సుఖ్‌దీప్‌, ఎమన్‌జోత్‌ చహల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అంతకుముందు పంజాబ​్‌ తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ ఉదమ్‌ సహారన్‌ 93 పరుగులతో రాణించాడు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో సహారన్‌ మినహా ఎ‍వ్వరూ రాణించలేదు. అన్మోల్‌ప్రీత్‌ (44), అభిజీత్‌ (33), హర్ప్రీత్‌ బ్రార్‌ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ తలో 3 వికెట్లు తీయగా.. శిఖర్‌ షెట్టి 2, విధ్యాదర్‌ పాటిల్‌, మొహిసిన్‌ ఖాన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

దీనికి ముందు కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 316 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్‌ గోపాల్‌ (77), కేఎల్‌ రాహుల్‌ (59) అర్ద సెంచరీలతో రాణించారు. మయాంక్‌ అగర్వాల్‌ (32), విధ్యాదర్‌ పాటిల్‌ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో హర్ప్రీత్‌ 4, సుఖ్‌దీప్‌ 3, అన్మోల్‌ 2, చహల్‌ ఓ వికెట్‌ తీశారు. 

అంతకుముందు పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. అభిజీత్‌ (81), చహల్‌ (83) అర్ద సెంచరీలతో రాణించగా.. సహారన్‌ (44) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించాడు. విధ్యాదర్‌ పాటిల్‌ 4, శ్రేయస్‌ గోపాల్‌ 3, మొహిసిన్‌ ఖాన్‌ 2, ప్రసిద్ద్‌ కృష్ణ ఓ వికెట్‌ తీశారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)