అభిషేక్‌ రెడ్డి డబుల్‌ సెంచరీ

Published on Wed, 11/19/2025 - 10:05

జంషెడ్‌పూర్‌: ఓపెనర్‌ అభిషేక్‌ రెడ్డి (348 బంతుల్లో 247; 20 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ డబుల్‌ సెంచరీతో చెలరేగడంతో ఆంధ్ర జట్టు కొండంత స్కోరు చేసింది. రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 128 ఓవర్లలో 567/6 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. 

ఓవర్‌నైట్‌ స్కోరు 224/2తో మంగళవారం మూడో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. అభిషేక్‌ రెడ్డి సంయమనంతో కూడిన ఇన్నింగ్స్‌తో జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. కరణ్‌ షిండే (129 బంతుల్లో 94; 7 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 

శ్రీకర్‌ భరత్, షేక్‌ రషీద్‌ అర్ధశతకాలు సాధించగా... త్రిపురణ విజయ్‌ (27), కెప్టెన్‌ రికీ భుయ్‌ (18) ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయితే ఐదో వికెట్‌కు కరణ్‌ షిండేతో కలిసి అభిõÙక్‌ రెడ్డి 208 పరుగులు జోడించడంతో ఆంధ్ర జట్టు భారీ స్కోరు చేయగలిగింది. ఆఖర్లో సౌరభ్‌ కుమార్‌ (13 బంతుల్లో 28 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడాడు. 

జార్ఖండ్‌ బౌలర్లలో అనుకూల్‌ రాయ్, రిషవ్‌ రాజ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జార్ఖండ్‌... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. 

శిఖర్‌ మోహన్‌ (3), కుమార్‌ కుషాగ్ర (16) అవుట్‌ కాగా... శరణ్‌దీప్‌ సింగ్‌ (13 బ్యాటింగ్‌) మానిషి (2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్, సౌరభ్‌ కుమార్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. మంగళవారం ఆట ముగిసే సరికి చేతిలో 8 వికెట్లు ఉన్న జార్ఖండ్‌ జట్టు... ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 205 పరుగులు వెనుకబడి ఉంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)