Breaking News

రాణించిన రహానే, ముషీర్‌ ఖాన్‌.. టైటిల్‌ దిశగా ముంబై

Published on Mon, 03/11/2024 - 17:34

రంజీ ట్రోఫీ 2024 ఫైనల్లో ముంబై టీమ్‌ గెలుపు దిశగా సాగుతుంది. విదర్భతో జరుగుతున్న తుది సమరంలో ఆ జట్టు పటిష్ట స్థితిలో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి, 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ముషీర్‌ ఖాన్‌ (51), కెప్టెన్‌ అజింక్య రహానే (58) అర్దసెంచరీలతో అజేయంగా క్రీజ్‌లో ఉన్నారు.

119 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ముంబై.. 34 పరుగులకే ఓపెనర్లు పృథ్వీ షా (11), భూపేన్‌ లాల్వాని (18) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే ముషీర్‌ ఖాన్‌, రహానే మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి తమ జట్టును సేఫ్‌ జోన్‌లోకి చేర్చారు. వీరు మూడో వికెట్‌కు అజేయమైన 107 పరుగులు జోడించి ముంబైను గెలుపు దిశగా నడిపిస్తున్నారు.

చాలాకాలం తర్వాత ముంబై కెప్టెన్‌ రహానే ఫామ్‌లోకి వచ్చాడు. కీలకమైన ఫైనల్లో రహానే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. విదర్భ బౌలర్లలో యశ్‌ ఠాకూర్‌ అద్భుతమైన బంతితో పృథ్వీ షాను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. లాల్వాని వికెట్‌ హర్ష్‌ దూబేకు దక్కింది.

అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే కుప్పకూలింది. దవళ్‌ కులకర్ణి (3/15), షమ్స్‌ ములానీ (3/32), తనుశ్‌ కోటియన్‌ (3/7) విదర్భను దారుణంగా దెబ్బకొట్టారు. విదర్భ ఇన్నింగ్స్‌లో అథర్వ తైడే (23), యశ్‌ రాథోడ్‌ (27), ఆదిత్య థాకరే (19), యశ్‌ ఠాకూర్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

ముంబై కూడా తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. విదర్భ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో ఆ జట్టు 224 పరుగులకే పరిమితమైంది. యశ్‌ ఠాకూర్‌ 3, హర్ష్‌ దూబే 3, ఉమేశ్‌ యాదవ్‌ 2, ఆదిత్య థాకరే ఓ వికెట్‌ పడగొట్టారు. ముంబై ఇన్నింగ్స్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ (75) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ముంబైకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించడంతో పాటు ఆ జట్టు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోనూ పటిష్టంగా ఉండటంతో ఆ జట్టునే విజయం వరించవచ్చు. ముంబై ఇప్పటికే ఏ జట్టుకు సాధ్యపడని రీతిలో 41 రంజీ టైటిళ్లు సాధించింది. 

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)