Breaking News

మెరిసిన పృథ్వీ షా.. పోరాటం చేస్తున్న మయాంక్‌ అగర్వాల్‌

Published on Mon, 02/26/2024 - 18:32

రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్‌ చివరి దశకు చేరుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు సెమీస్‌ బెర్త్‌లు ఖరారు కాగా.. మరో రెండు బెర్త్‌ల భవితవ్యం రేపటి లోగా తేలిపోనుంది. సౌరాష్ట్రపై గెలిచి తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్‌పై గెలిచి మధ్యప్రదేశ్‌ సెమీస్‌కు అర్హత సాధించగా.. మిగతా క్వార్టర్‌ ఫైనల్స్‌లో విదర్భ-కర్ణాటక, ముంబై-బరోడా అమీతుమీ తేల్చుకు​ంటున్నాయి. 

బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ ఆథిక్యం సాధించి పటిష్ట స్థితిలో ఉండగా.. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక పోరాడుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 415 పరుగుల లీడ్‌లో ఉండగా.. 371 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కర్ణాటకకు గెలుపు ఛాలెంజ్‌లా మారింది. మరో రోజు ఆట మిగిలుండగా.. కర్ణాటక లక్ష్యానికి ఇంకా 268 పరుగుల దూరంలో ఉంది. కర్ణాటకను గెలిపించేందుకు కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ పోరాట​ం చేస్తున్నాడు. 

మెరిసిన పృథ్వీ షా..
బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో (సెకెండ్‌ ఇన్నింగ్స్‌) హార్దిక్‌ తామోర్‌ (114), పృథ్వీ షా (87) సత్తా చాటడంతో ముంబై పటిష్ట స్థితికి చేరింది. 

  • ముంబై తొలి ఇన్నింగ్స్‌ 384 (ముషీర్‌ ఖాన్‌ 203 నాటౌట్‌, భార్గవ్‌ భట్‌ 7/112)
  • బరోడా తొలి ఇన్నింగ్స్‌ 348 (షశ్వత్‌ రావత్‌ (124, సోలంకి 136, షమ్స్‌ ములానీ 4/121)
  • ముంబై సెకెండ్‌ ఇన్నింగ్స్‌ 379/9 (హార్దిక్‌ తామోర్‌ 114, పృథ్వీ షా 87, భార్గవ్‌ భట్‌ 7/142)
  • నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 415 పరుగుల ఆధిక్యంలో ఉంది

పోరాడుతున్న మయాంక్‌..
విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్‌ మయాంక్‌ అగార్వల్‌ పోరాటం చేస్తున్నాడు. 

  • విదర్భ తొలి ఇన్నింగ్స్‌ 460 (అథర్వ తైడే 109, కావేరప్ప 4/99)
  • కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌ 286 (నికిన్‌ జోస్‌ 82, యాశ్‌ ఠాకూర్‌ 3/48)
  • విదర్భ రెండో ఇన్నింగ్స్‌ 196 (దృవ్‌ షోరే 57, కావేరప్ప 6/61)
  • కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌ 103/1 (మయాంక్‌ అగర్వాల్‌ 61 నాటౌట్‌, సర్వటే 1/10)
  • ఈ మ్యాచ్‌లో కర్ణాటక విజయం సాధించాలంటే మరో 268 పరుగులు చేయాలి
     

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)