Breaking News

చరిత్రపుటల్లోకెక్కిన మధ్యప్రదేశ్‌ బౌలర్‌

Published on Mon, 02/12/2024 - 19:58

మధ్యప్రదేశ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ కుల్వంత్‌ కేజ్రోలియా చరిత్రపుట్లోకెక్కాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో అతను నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్‌ ఆఖరి రోజు 95వ ఓవర్‌ వేసిన కుల్వంత్‌.. రెండు, మూడు, నాలుగు, ఐదు బంతులకు వికెట్లు తీసి, రంజీల్లో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

కుల్వంత్‌కు ముందు ఢిల్లీ బౌలర్‌ శంకర్‌ సైనీ (1988), జమ్మూ కశ్మీర్‌ బౌలర్‌ మొహమ్మద్‌ ముదాసిర్‌ (2018) మాత్రమే రంజీల్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశారు. కుల్వంత్‌ హ్యాట్రిక్‌ సహా ఐదు వికెట్లతో విరుచుకుపడటంతో (5/34) మధ్యప్రదేశ్‌ ఇన్నింగ్స్‌ 52 పరుగుల తేడాతో బరోడాపై ఘన విజయం సాధించింది.

ఐపీఎల్‌లో ఢిల్లీ, కేకేఆర్‌ జట్ల తరఫున ఆడిన కుల్వంత్‌.. మధ్యప్రదేశ్‌ తరఫున హ్యాట్రిక్‌ సాధించిన మూడో బౌలర్‌గా, రంజీ చరిత్రలో హ్యాట్రిక్‌ సాధించిన 80వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. నాలుగో బంతుల్లో నాలుగు వికెట్ల ఘనతను అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఎక్కువ మంది సాధించలేదు. ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. లసిత్‌ మలింగ, ఆండ్రీ రసెల్‌, షాహీన్‌ అఫ్రిది, రషీద్‌ ఖాన్‌, జేసన్‌ హోల్డర్‌ ఈ అరుదైన రికార్డును నమోదు చేశారు. 

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 454 పరుగులకు ఆలౌటైంది. హిమాన్షు మంత్రి (111) సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం​ బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే కుప్పకూలింది. అనుభవ్‌ అగర్వాల్‌, సరాన్ష్‌ జైన్‌ బరోడా పతనాన్ని శాశించారు. కుల్వంత్‌ 2 వికెట్లు తీశాడు. ఆతర్వాత ఫాలో ఆన్‌ ఆడిన బరోడా.. కుల్వంత్‌ ధాటికి సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు చాపచుట్టేసి ఇన్నింగ్స్‌ పరాజయాన్ని ఎదుర్కొంది. రావత్‌ (105) సెంచరీ చేసినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)