Breaking News

రంజీ ట్రోఫీ చరిత్రలో అరుదైన ఘట్టం

Published on Sat, 10/12/2024 - 17:30

రంజీ ట్రోఫీ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన టాప్‌-4 బ్యాటర్లు సెంచరీలు చేశారు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇలా జరగడం​ ఇది రెండో సారి మాత్రమే. 2019 ఎడిషన్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా టాప్‌-4 ఆటగాళ్లు సెంచరీలు చేశారు. 

నాడు అమోన్కర్‌ (160), గోవెకర్‌ (160), స్మిత్‌ పటేల్‌ (137 నాటౌట్‌), అమిత్‌ వర్మ (122 నాటౌట్‌) మూడంకెల స్కోర్‌ను చేశారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిమాచల్‌ టాప్‌-4 బ్యాటర్లు శుభమ్‌ అరోరా (11), చోప్రా (171), అంకిత్‌ కల్సి (205 నాటౌట్‌), ఏకాంత్‌ సేన్‌ (101) సెంచరీలు చేశారు. ఓవరాల్‌గా ఫస్టక్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో ఇలా టాప్‌-4 బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది 14వ సారి.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాప్‌-4 బ్యాటర్లు సెంచరీలతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన హిమాచల్‌ తొలి ఇన్నింగ్స్‌ను 663 పరుగుల వద్ద (3 వికెట్ల నష్టానికి) డిక్లేర్‌ చేసింది. డబుల్‌ సెంచరీ చేసిన అంకిత్‌ కల్సితో పాటు మయాంక్‌ డాగర్‌ (56) క్రీజ్‌లో ఉన్నాడు. ఉత్తరాఖండ్‌ బౌలర్లలో మయాంక్‌ మిశ్రా, స్వప్నిల్‌ సింగ్‌, యువరాజ్‌ చౌదరీ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఉత్తరాఖండ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 50 పరుగులు చేసింది. కెప్టెన్‌ రవికుమార్‌ సమర్థ్‌ 21 పరుగులు చేసి ఔట్‌ కాగా.. అవ్‌నీశ్‌ సుధా (24), వైభవ్‌ బట్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. రవికుమార్‌ వికెట్‌ వైభవ్‌ అరోరాకు దక్కింది. హిమాచల్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఉత్తరాఖండ్‌ ఇంకా 613 పరుగులు వెనుకపడి ఉంది.

చదవండి: మాహారాజు కాబోతున్న టీమిండియా మాజీ క్రికెటర్‌.. ఎవరంటే?

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌