Breaking News

సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్న ఆంధ్ర కెప్టెన్‌

Published on Sun, 02/11/2024 - 18:56

రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌ కెప్టెన్ రికీ భుయ్‌ వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే మూడు శతకాలు చేసిన భుయ్‌.. తాజాగా ఉత్తర్‌ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగో సెంచరీతో (సెకెండ్‌ ఇన్నింగ్స్‌) మెరిశాడు.

ఈ మ్యాచ్‌లో భుయ్‌ సెంచరీతో కదంతొక్కడంతో ఆంధ్ర జట్టు పటిష్ట స్థితికి చేరింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి జట్టు స్కోర్‌ 271/5గా ఉంది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం ఆంధ్ర జట్టు 334 పరుగుల లీడ్‌లో ఉంది. భుయ్‌కు (100) జతగా షేక్‌ రషీద్‌ (42) క్రీజ్‌లో ఉన్నాడు. 

ఈ మ్యాచ్‌లో భుయ్‌ తొలి ఇన్నింగ్స్‌లోనూ అదరగొట్టాడు. ఆరు పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. ఈ సీజన్‌లో భుయ్‌ ఇప్పటివరకు ఆడిన 9 ఇన్నింగ్స్‌ల్లో 93 సగటున నాలుగు సెంచరీలు, రెండు అర్ధసెంచరీల సాయంతో 744 పరుగులు చేసి సెకెండ్‌ లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. 

ప్రస్తుత రంజీ సీజన్‌లో భుయ్‌ చేసిన సెంచరీలు..

  • బెంగాల్‌పై 175
  • ఆసోంపై 125
  • చత్తీస్‌ఘడ్‌పై 120
  • ఉత్తర్‌ప్రదేశ్‌పై 100 నాటౌట్‌

మ్యాచ్‌ విషయానికివస్తే.. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 261 పరుగులకు ఆలౌటైంది. భుయ్‌ (94), శశికాంత్‌ (72) అర్ద సెంచరీలతో రాణించారు. యూపీ బౌలర్లలో యశ్‌ దయాల్‌, రాజ్‌పుత్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ఆకిబ్‌ ఖాన్‌, సౌరభ్‌ కుమార్‌ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన యూపీ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది. యూపీ ఇన్నింగ్స్‌లో ఆర్యన్‌ జురెల్‌ (60) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. శశికాంత్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు. 63 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ కలపుకుని ఆంధ్ర 334 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)