Breaking News

యశ్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌.. 261 పరుగుల ఆధిక్యంలో విదర్భ

Published on Mon, 03/04/2024 - 19:07

రంజీ ట్రోఫీ 2024 తొలి సెమీఫైనల్లో విదర్భ జట్టు 261 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఎంపీ టీమ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. యశ్‌ రాథోడ్‌ (97 నాటౌట్‌).. కెప్టెన్‌ అక్షయ్‌ వాద్కర్‌తో (77) కలిసి బాధ్యతాయుతమై ఇన్నింగ్స్‌ ఆడి విదర్భకు ఆధిక్యతను అందించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలిన విదర్భ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకుని మధ్యప్రదేశ్‌పై పైచేయి సాధించింది. యశ్‌, అక్షయ్‌తో పాటు అయన్‌ మోఖడే (59) అర్దసెంచరీతో రాణించగా.. దృవ్‌ షోరే (40), కరుణ్‌ నాయర్‌ (38) పర్వాలేదనిపించారు. యశ్‌తో పాటు ఆదిత్య సర్వటే (14) క్రీజ్‌లో ఉన్నాడు.

ఎంపీ బౌలర్లలో అనుభవ్‌ అగర్వాల్‌, కుమార్‌ కార్తికేయ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్‌ ఖాన్‌, కేజ్రోలియా చెరో వికెట్‌ దక్కించుకున్నారు. అంతకుముందు మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. హిమాన్షు మంత్రి (126) సూపర్‌ సెంచరీతో సత్తా చాటాడు. మధ్యప్రదేశ్‌ ఇన్నింగ్స్‌లో మంత్రి మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. విదర్భ బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌, యశ్‌ ఠాకూర్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. వాఖరే 2, సర్వటే ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

దీనికి ముందు విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. ఆవేశ్‌ ఖాన్‌ (4/49), కేజ్రోలియా (2/38), వెంకటేశ్‌ అయ్యర్‌ (2/28), అనుభవ్‌ అగర్వాల్‌ (1/42), కుమార్‌ కార్తికేయ (1/2) విదర్భ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. విదర్భ ఇన్నింగ్స్‌లో కరుణ్‌ నాయర్‌ (63) ఒక్కడే పర్వాలేదనిపించాడు. కాగా, మరో సెమీఫైనల్లో తమిళనాడును మట్టికరిపించి ముంబై ఫైనల్‌కు చేరింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)