Breaking News

Ranji Trophy: పంజాబ్‌ను చిత్తు చేసి.. సెమీస్‌కు దూసుకెళ్లిన సౌరాష్ట్ర

Published on Sat, 02/04/2023 - 17:10

Ranji Trophy 2022-23 - Saurashtra vs Punjab: రంజీ ట్రోఫీ 2022-2023 సీజన్‌లో ఆఖరి సెమీ ఫైనలిస్టు ఖరారైంది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌ , బెంగాల్‌, కర్ణాటక సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకోగా.. తాజాగా సౌరాష్ట్ర ఫైనల్‌ ఫోర్‌ జాబితాలో చేరింది. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌-2లో పంజాబ్‌ను చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది.

పార్థ్‌ భట్‌ అద్భుత ఇన్నింగ్స్‌
సొంత మైదానం సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో పంజాబ్‌తో తలపడింది అర్పిత్‌ వసవాడ సేన. జనవరి 31న మొదలైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ స్నెల్‌ పటేల్‌ 70 పరుగులతో రాణించగా.. పార్థ్‌ భట్‌ 111 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మిగతా వాళ్లంతా చేతులెత్తేసినా ఒంటరి పోరాటం చేశాడు. దీంతో 303 పరుగుల వద్ద సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. పంజాబ్‌ బౌలర్లలో మార్కండే నాలుగు, బల్జీత్‌ సింగ్‌ 3, సిద్దార్థ్‌ కౌల్‌ 2, నామన్‌ ధిర్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

అదరగొట్టారు.. అయినా
ఇక పంజాబ్‌కు ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌(126), నామన్‌ ధిర్‌(131) అదిరిపోయే ఆరంభం అందించారు. నాలుగో స్థానంలో వచ్చిన మన్‌దీప్‌ (91) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగతా వాళ్లలో వికెట్‌ కీపర్‌ అన్మోల్‌ మల్హోత్రా 41 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 431 పరుగులకు ఆలౌట్‌ అయిన పంజాబ్‌.. సౌరాష్ట్రపై తొలి ఇన్నింగ్స్‌లో వంద పరుగుల పైచిలుకు ఆధిక్యం సాధించగలిగింది.

5 వికెట్లతో చెలరేగిన పార్థ్‌ భట్‌
ఈ క్రమంలో సౌరాష్ట్ర 379 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌ ముగించింది. దీంతో పంజాబ్‌ను కట్టడి చేయాలని భావించిన సౌరాష్ట్రకు బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ పార్థ్‌ భట్‌ ఊతంగా నిలిచాడు. ఏకంగా 5 వికెట్లతో(33 ఓవర్లలో 89 పరుగులు) చెలరేగి పంజాబ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. ధర్మేంద్ర జడేజా మూడు, యువరాజ్‌సిన్హ్‌ దోడియా రెండు వికెట్లతో రాణించారు.

కర్ణాటకతో అమీతుమీ
సౌరాష్ట్ర బౌలర్ల విజృంభణతో పంజాబ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో శనివారం 71 పరుగుల తేడాతో విజయఢంకా మోగించిన సౌరాష్ట్ర.. సెమీస్‌కు దూసుకెళ్లింది. ఫైనల్‌ చేరే క్రమంలో కర్ణాటకతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సత్తా చాటి సౌరాష్ట్రను గెలిచిన పార్థ్‌ భట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్‌-2 సౌరాష్ట్ర వర్సెస్‌ పంజాబ్‌ స్కోర్లు
సౌరాష్ట్ర- 303 & 379
పంజాబ్‌- 431 & 180

చదవండి: షాహీన్‌తో కుమార్తె వివాహం.. ఆఫ్రిది భావోద్వేగం! ట్వీట్‌ వైరల్‌ 
Gill-Kohli: 'నీకు పదేళ్లు ఇస్తా.. సగం అయినా పట్టగలవేమో చూస్తా'

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)