Breaking News

నిప్పులు చెరిగిన ఆవేశ్‌ ఖాన్‌.. 7 వికెట్లతో సత్తా చాటిన టీమిండియా బౌలర్‌

Published on Thu, 01/05/2023 - 12:19

Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా జనవరి 3న ప్రారంభమైన గ్రూప్‌ మ్యాచ్‌ల్లో మిగతా జట్లతో పాటు విదర్భ-మధ్యప్రదేశ్‌ జట్లు కూడా పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విదర్భ తొలి బౌలింగ్‌ ఎంచుకుని ప్రత్యర్ధిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రజత్‌ పాటిదార్‌ (121) శతకంతో, సరాన్ష్‌ జైన్‌ (61) హాఫ్‌ సెంచరీతో రాణించడంతో మధ్యప్రదేశ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బౌలర్లలో యశ్‌ ఠాకూర్‌ 4, లలిత్‌ యాదవ్‌, సర్వటే చెరో 2 వికెట్లు, భుటే ఓ వికెట్‌ పడగొట్టాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విదర్భ.. మధ్యప్రదేశ్‌ పేసర్‌ ఆవేశ్‌ ఖాన్‌ ధాటికి చిగురుటాకులా వణికింది. ఆవేశ్‌.. తాను వేసిన 22 ఓవర్లలో 8 మెయిడిన్లు వేసి కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి 7 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. ఆవేశ్‌ ఖాన్‌ ధాటికి విదర్భ 160 పరుగులకే చేతులెత్తేసిం‍ది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో సంజయ్‌ రఘునాథ్‌ (58) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు.

అతను మినహా మరో ముగ్గురు రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో ఉగ్రరూపం దాల్చిన ఆవేశ్‌ ఖాన్‌ టీమిండియాలో చోటే లక్ష్యంగా సాగాడు. అతనికి జతగా జి యాదవ్‌, కుమార్‌ కార్తికేయ తలో వికెట్‌ పడగొట్టారు. కాగా, ఆవేశ్‌ ఖాన్‌.. టీమిండియా తరఫున 5 వన్డేలు, 15 టీ20లు ఆడిన విషయం తెలిసిందే. ఇందులో అతను మొత్తంగా 16 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోకీ ఎంట్రీ ఇచ్చిన ఈ ఇండోర్‌ బౌలర్‌.. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌, ప్రస్తుతం లక్నో సూపర్‌ జెయింట్స్‌లో ​కొనసాగుతున్నాడు. ఆవేశ్‌.. తన ఐపీఎల్‌ కెరీర్‌లో 38 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు పడగొట్టాడు. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)