Breaking News

హైదరాబాద్‌ x ముంబై

Published on Thu, 01/22/2026 - 03:24

సాక్షి, హైదరాబాద్‌: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్, ముంబై జట్ల మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. రెండో అంచె పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానుండగా... 42 సార్లు చాంపియన్‌ ముంబై జట్టుతో ఉప్పల్‌ స్టేడియం వేదికగా హైదరాబాద్‌ తలపడనుంది. 

గ్రూప్‌ ‘డి’లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఒక ఓటమి, మూడు ‘డ్రా’లతో 13 పాయింట్లు సాధించిన హైదరాబాద్‌ నాలుగో స్థానంలో... పరాజయం ఎరగని ముంబై 24 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. లీగ్‌ దశలో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా... ఈ రెండింట్లో మెరుగైన ప్రదర్శన చేయాలని హైదరాబాద్‌ భావిస్తోంది. 

స్టార్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ అందుబాటులో లేకపోగా... టీమిండియా పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ హైదరాబాద్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అజింక్యా రహానే అందుబాటులో లేకపోయినా... శార్దుల్‌ ఠాకూర్‌ సారథ్యంలోని ముంబై జట్టు సర్ఫరాజ్‌ ఖాన్, ముషీర్‌ ఖాన్, షమ్స్‌ ములానీ, సిద్ధేశ్‌ లాడ్‌లతో పటిష్టంగా ఉంది. ప్రతి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.   

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)