Breaking News

విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన ఆర్సీబీ కెప్టెన్‌

Published on Thu, 08/28/2025 - 15:14

ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ దులీప్‌ ట్రోఫీ రెండో క్వార్టర్‌ ఫైనల్లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో సెంట్రల్‌ జోన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రజత్‌.. నార్త్‌ ఈస్ట్‌ జోన్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 28) ప్రారంభమైన మ్యాచ్‌లో కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో రజత్‌తో పాటు మరో సెంట్రల్‌ జోన్‌ ఆటగాడు కూడా సెంచరీ చేశాడు. వన్‌ డౌన్‌లో బరిలోకి దిగిన దనిశ్‌ మలేవార్‌ 171 బంతుల్లో 25 ఫోర్ల సాయంతో 132 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. మలేవార్‌కు జతగా రజత్‌ పాటిదార్‌ 111 పరుగుల వద్ద (85 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నాడు.

టీ విరామం సమయానికి సెంట్రల్‌ జోన్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 314 పరుగులుగా (61 ఓవర్లలో) ఉంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ గ్రౌండ్‌-బిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ టాస్‌ గెలిచి సెంట్రల్‌ జోన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్‌ జోన్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది.

ఓపెనర్‌ ఆయుశ్‌ పాండే 3 పరుగులకే ఔటయ్యాడు. ఆకాశ్‌ చౌదరీ బౌలింగ్‌లో హేమ్‌ ఛెత్రీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆయుశ్‌ పాండే ఔటయ్యాక సెంట్రల్‌ జోన్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడింది. మరో ఓపెనర్‌ ఆర్యన్‌ జుయల్‌ 60 పరుగుల వద్ద అనుకోకుండా గాయపడి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. 

అనంతరం​ బరిలోకి దిగిన రజత్‌ పాటిదార్‌ టీ20లకు తలపిస్తూ షాట్లు ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో మలేవార్‌ కూడా వీలు చిక్కినప్పుడల్లా చెత్త బంతులను బౌండరీలకు తరలించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ సెంట్రల్‌ జోన్‌ను ఇప్పటికే పటిష్ట స్థితిలో ఉంచారు. ఈ మ్యాచ్‌ గెలిస్తే సెం‍ట్రల్‌ జోన్‌ సెమీస్‌కు చేరుతుంది. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)