IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌కు భారీ షాక్‌.. రూ. 24 లక్షల జరిమానా

Published on Sat, 05/24/2025 - 13:31

ఐపీఎల్‌-2025లో భాగంగా శుక్రవారం లక్నో వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 ప‌రుగుల తేడాతో రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఓట‌మి పాలైంది. అయితే ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీ కెప్టెన్ ర‌జిత్ పాటిదార్‌కు భారీ షాక్ త‌గిలింది. 

స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌లో  స్లో ఓవర్‌ రేట్‌ మెయింటైన్‌ చేసినందుకు గానూ పాటిదార్‌కు రూ. 24 ల‌క్ష‌ల భారీ జ‌రిమానా ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ విధించింది. అలాగే జ‌ట్టులో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా అంద‌రూ రూ. 6 ల‌క్ష‌లు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం జ‌రిమానాగా చెల్లించాల‌ని ఆదేశించింది.

ఈ సీజ‌న్‌లో ఆర్సీబీ జ‌ట్టు స్లో ఓవ‌ర్ రేట్‌ను న‌మోదు చేయ‌డం ఇది రెండో సారి. అందుకే అంత భారీ మొత్తంలో జ‌రిమానా విధించారు. కాగా ఈ మ్యాచ్‌లో బెంగ‌ళూరు సార‌ధిగా జితేష్ శ‌ర్మ‌ వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌టికి.. రూల్స్ ప్ర‌కారం ఎవరైతే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా ఉంటారో వారే ఫైన్‌ను భ‌రించాల్సి ఉంటుంది. 

ఈ క్ర‌మంలోనే పాటిదార్‌పై జ‌రిమానా ప‌డింది. మ‌రోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ కు కూడా స్లో ఓవర్ రేట్ (Slow over rate) కారణంగా జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం కమిన్స్ కు తొలిసారి స్లో ఓవర్ రేట్ కారణంగా రూ. 12 లక్షలు జరిమానా పడింది.
చదవండి: ENG vs ZIM: 22 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు.. ఓట‌మి దిశ‌గా జింబాబ్వే

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)