Breaking News

మ‌న‌సు మార్చుకున్న పాటిదార్‌.. మ‌ళ్లీ కెప్టెన్‌గా ఎంపిక‌

Published on Tue, 09/30/2025 - 20:01

రంజీ ట్రోఫీ సీజన్ 2025-26 కోసం మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) తమ జట్టును ప్రకటించింది. శుబ్‌మన్ శర్మ స్ధానంలో రజత్ పాటిదార్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 32 ఏళ్ల పాటిదార్ గతంలో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ జట్టకు నాయకత్వం వహించడానికి నిరాకరించాడు.

కానీ ఇప్పుడు ఎంపీసీఎ పెద్దల సూచన మేరకు రజత్ తన మనసు మార్చుకున్నాడు. పాటిదార్ కెప్టెన్‌గా ప్రస్తుతం విజయపథంలో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది జూన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి ఐపీఎల్ టైటిల్‌ను పాటిదార్ అందించాడు.

అదేవిధంగా అతడి సారథ్యంలోనే సెంట్రల్ జోన్ దులీప్ ట్రోఫీ-2025 టైటిల్‌ను  సొంతం చేసుకుంది.  సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (SMAT)-2025, విజయ్ హజారే ట్రోఫీ (VHT) లలో మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా పాటిదార్ వ్యవహరించాడు. ఇక రాబోయే రంజీ సీజన్‌కు స్టార్ పేసర్ అవేష్ ఖాన్ గాయం కారణంగా దూరమయ్యాడు. 

అవేష్ జూన్ 17న ముంబైలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతడు తన గాయం నుం‍చి క్రమంగా కోలుకుంటున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరో నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అతడు రంజీ ట్రోఫీ సెకెండ్ లెగ్ సమయానికి అంద‌బాటులోకి వ‌చ్చే ఛాన్స్ ఉంది.

రంజీ ట్రోఫీకి మ‌ధ్యప్ర‌దేశ్ జ‌ట్టు ఇదే..
రజత్ పాటిదార్ (కెప్టెన్‌), యష్ దూబే, హర్ష్ గావ్లీ, శుభమ్ శర్మ, హిమాన్షు మంత్రి, హర్‌ప్రీత్ సింగ్, వెంకటేష్ అయ్యర్, సాగర్ సోలంకి, కుమార్ కార్తికే, సరాంశ్ జైన్, అధీర్ ప్రతాప్, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్, అనుభవ్ అగర్వాల్, కుల్దీప్ సేన్
చదవండి: ఆ పాక్ ఆట‌గాడికి థ్యాంక్స్.. అత‌డి వ‌ల్లే గెలిచాము: అశ్విన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)