Breaking News

టీమిండియాలోనే కాదు.. ఇక్కడా ఇంతేనా?! వీడియో వైర‌ల్‌

Published on Sat, 03/23/2024 - 06:40

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన టీమిండియా ఆట‌గాడు, ఆర్సీబీ మిడిలార్డర్ బ్యాటర్‌ ర‌జ‌త్ పాటిదార్‌.. ఇప్పుడు ఐపీఎల్‌-2024లోనూ అదే తీరును క‌న‌బరిచాడు. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తొలి మ్యాచ్‌లో పాటిదార్ దారుణంగా విఫలమయ్యాడు. 3 బంతులు ఎదుర్కొన్న పాటిదార్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

ఆర్సీబీ ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి ఎటువంటి ఫుట్ మూమెంట్ లేకుండా ఆఫ్ సైడ్ వైపు ఆడటానికి పాటిదార్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ ధోని చేతికి వెళ్లింది. ధోని ఎటువంటి తప్పిదం చేయకుండా రెగ్యులేషన్ క్యాచ్‌ను అందుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఇదేమి ఆటరా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆర్సీబీపై చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18. 4 ఓవర్లలో ఛేదించింది. సీఎస్‌కే బ్యాటర్లలో రచిన్‌ రవీంద్ర(37) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. శివమ్‌ దూబే(34 నాటౌట్‌), రవీంద్ర జడేజా(25 నాటౌట్‌) రాణించారు.

కాగా ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆర్సీబీని అనుజ్‌ రావత్‌(48), దినేష్‌ కార్తీక్‌(38 నాటౌట్‌) తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో అదుకున్నారు. వీరితో పాటు కెప్టెన్‌ డుప్లెసిస్‌(35) పరుగులతో రాణించాడు. సీఎస్‌కే బౌలర్లలో ముస్తుఫిజర్‌ రెహ్మాన్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)