‘రజతాభిషేకం’ 

Published on Mon, 06/01/2026 - 06:05

ఐపీఎల్‌లో వరుసగా రెండు టైటిల్స్‌ నెగ్గిన కెప్టెన్లు గతంలో ఇద్దరు ఉన్నారు. అయితే మిగతా ఇద్దరిలో పోలిస్తే నాయకుడిగా రజత్‌ పాటీదార్‌ ప్రస్థానం ఎంతో భిన్నం. రెండు ట్రోఫీలు గెలిపించే సమయానికి ధోని దిగ్గజ కెప్టెన్‌గా గుర్తింపు పొంది రెండు ప్రపంచ కప్‌లు కూడా అందించాడు. రోహిత్‌ వరుసగా రెండు గెలవడానికి ముందే కెప్టెన్‌గా అతని ఖాతాలో మరో మూడు కప్‌లు ఉన్నాయి. కానీ పాటీదార్‌ భారత్‌ తరఫున తన చివరి టెస్టును 2024లో, ఏకైక వన్డేను 2023లో ఆడాడు. ఆ తర్వాత మళ్లీ అతనికి టీమిండియా అవకాశం దక్కలేదు.

గత ఏడాది పాటీదార్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. మితభాషి, తన భావనలను ప్రదర్శించలేని అతను సారథిగా ఏం చేస్తాడు అని భావించారు. ద్రవిడ్, పీటర్సన్, కుంబ్లే, వెటోరి, కోహ్లిలాంటి దిగ్గజాల వల్ల సాధ్యం కాని భారం అతనిపై మోపినట్లు అనిపించింది. దాదాపు రెండేళ్ల క్రితం మొదటిసారి పాటీదార్‌ను కెప్టెన్‌గా చేయాలనే ఆలోచన వచ్చిప్పుడు ఆర్‌సీబీ డైరెక్టర్‌ బొబాట్, కోచ్‌ ఫ్లవర్‌ చిన్నపాటి ఇంటర్వ్యూ చేశారు. జట్టు పరిస్థితి బాగుపర్చేందుకు కెప్టెన్‌గా ఏం సూచిస్తావు అని అడిగారు. టీమ్‌ వాతావరణం, నమ్మకం, ముందుండి నడిపించడంలాంటి రొటీన్‌ మాటలు అతను చెప్పలేదు.

‘పదునైన పేస్‌ బౌలింగ్‌ బృందం కావాలి’ అని ఒకే ఒక్క మాటతో ముగించాడు. ముస్తాక్‌ అలీ ట్రోఫీలో కెప్టెన్‌గా మధ్యప్రదేశ్‌ను నడిపించిన తీరు చూసి కోహ్లి అనుమతితో వెంటనే పాటీదార్‌ను కెప్టెన్‌గా నియమించారు. స్టార్‌ ఆటగాడిగా గుర్తింపు లేదు. ప్రత్యేక ఆకర్షణగా ఎక్కడా కనిపించడు. టీమ్‌ సమావేశాల్లో కూడా గలగలా మాట్లాడే అలవాటు లేదు. కానీ ఒక్కసారి మైదానంలోకి దిగిన తర్వాతే అతనిలోని కెప్టెన్‌ బయటకు వస్తాడు. ఆ తర్వాత తాను స్వేచ్ఛగా పని చేస్తాడు. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ లక్షణాలే అతని సారథ్యంపై నమ్మకం ఉంచేందుకు కారణం అయ్యాయని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది. 

ఆటగాడిగా కూడా అతను ఒక్కసారిగా ఐపీఎల్‌ వేదికపై దూసుకురాలేదు. 2021లో ఆర్‌సీబీ తరఫున 4 మ్యాచ్‌లలో 71 పరుగులే చేయడంతో తర్వాతి ఏడాది జట్టు అతడిని వదిలేసుకుంది. అయితే గాయంతో లవ్‌నీత్‌ తప్పుకోవడంతో అతని స్థానంలో 2022లో మళ్లీ చాన్స్‌ దక్కగా, లక్నోపై అద్భుత సెంచరీతో సత్తా చాటాడు. తర్వాతి సీజన్‌ గాయంతో దూరమైనా...గత ఏడాది కెప్టెన్‌గా అసాధారణ విజయాన్ని అందించాడు. తాజా సీజన్‌లో బ్యాటర్‌గా కూడా అతను విధ్వంసం సృష్టించాడు. 14 ఇన్నింగ్స్‌లలో 30 ఫోర్లు, 42 సిక్సర్లు సహా ఏకంగా 192.69 స్ట్రయిక్‌రేట్‌తో 501 పరుగులు నమోదు చేసి కోహ్లి తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ఆదివారమే ఫైనల్‌ ముగియగా... తన 33వ పుట్టిన రోజున అందుకున్న రెండో ట్రోఫీతో రజత్‌ పాటీదార్‌ తన పేరును ప్రత్యేకంగా లిఖించుకున్నాడు.  

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)