Breaking News

రాజస్తాన్‌ ఖాతా తెరిచింది

Published on Mon, 03/31/2025 - 05:28

గువాహాటి: ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా రెండు ఓటముల నుంచి రాజస్తాన్‌ రాయల్స్‌ కోలుకుంది. తమ మూడో మ్యాచ్‌లో విజయంతో పాయింట్ల పట్టికలో బోణీ చేసింది. ఆదివారం చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన  మ్యాచ్‌లో రాజస్తాన్‌ 6 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. చెన్నైకిది వరుసగా రెండో పరాజయం. 

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా, రియాన్‌ పరాగ్‌ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. కెపె్టన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా... రవీంద్ర జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు.  

రాణా మెరుపులు... 
తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్‌ (4) వెనుదిరగ్గా... సంజు సామ్సన్‌ (16 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్‌), రాణా కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. ముఖ్యంగా రాణా ఏ బౌలర్‌నూ వదలకుండా చెలరేగిపోయాడు. ఒవర్టన్‌ వరుస రెండు ఓవర్లలో కలిపి 3 ఫోర్లు, సిక్స్‌ కొట్టాక అశ్విన్‌ ఓవర్లో అతను వరుసగా 6, 6, 4 బాదాడు. ఆ తర్వాత ఖలీల్‌ ఓవర్లోనూ 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన రాణా 21 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. సామ్సన్‌ అవుటయ్యాక కొద్దిసేపు రాణాకు పరాగ్‌ అండగా నిలిచాడు. 

అశ్విన్‌ ఓవర్లో మళ్లీ వరుసగా 6, 4 కొట్టాక తర్వాతి బంతికి స్టంపౌట్‌ కావడంతో రాణా మెరుపు ఇన్నింగ్స్‌ ముగిసింది. అయితే అతను అవుటయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చెన్నై బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించడంతో రాయల్స్‌ ఆశించిన స్కోరుకు చాలా దూరంలో ఆగిపోయింది. రాణా వెనుదిరిగాక 51 బంతుల్లో 58 పరుగులు మాత్రమే చేయగలిగిన జట్టు 6 వికెట్లు చేజార్చుకుంది. పవర్‌ప్లేలో 79 పరుగులు చేసిన రాజస్తాన్‌ మిగిలిన 14 ఓవర్లలో కలిపి 103 పరుగులు మాత్రమే సాధించింది.  

రుతురాజ్‌ హాఫ్‌ సెంచరీ... 
ఛేదనలో చెన్నై మొదటి ఓవర్లోనే రచిన్‌ రవీంద్ర (0) వికెట్‌ కోల్పోగా, ఐదు బంతుల వ్యవధిలో 3 ఫోర్లు, సిక్స్‌ కొట్టి ధాటిని ప్రదర్శంచిన రాహుల్‌ త్రిపాఠి (19 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. మరోవైపు రుతురాజ్‌ మాత్రం కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. సందీప్‌ ఓవర్లో అతను 3 ఫోర్లు కొట్టాడు. పరాగ్‌ అద్భుత క్యాచ్‌కు శివమ్‌ దూబే (18) వెనుదిరగ్గా, విజయ్‌శంకర్‌ (9) విఫలమయ్యాడు. 

37 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన రుతురాజ్‌ను కీలక సమయంలో హసరంగ అవుట్‌ చేశాడు. 25 బంతుల్లో 54 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని (11 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్‌) క్రీజ్‌లోకి వచ్చాడు. అయితే అతనూ ప్రభావం చూపలేకపోగా, మరో ఎండ్‌లో జడేజా కూడా జట్టును గెలిపించడంలో సఫలం కాలేకపోయాడు. ఆఖరి 2 ఓవర్లలో విజయానికి 39 పరుగులు అవసరం కాగా, చెన్నై 32 పరుగులు రాబట్టగలిగింది.  

స్కోరు వివరాలు 
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) అశ్విన్‌ (బి) అహ్మద్‌ 4; సామ్సన్‌ (సి) రచిన్‌ (బి) నూర్‌ 20; నితీశ్‌ రాణా (స్టంప్డ్‌) ధోని (బి) అశ్విన్‌ 81; పరాగ్‌ (బి) పతిరణ 37; జురేల్‌ (సి) పతిరణ (బి) నూర్‌ 3; హసరంగ (సి) శంకర్‌ (బి) జడేజా 4; హెట్‌మైర్‌ (సి) అశ్విన్‌ (బి) పతిరణ 19; ఆర్చర్‌ (సి) గైక్వాడ్‌ (బి) అహ్మద్‌ 0; కార్తికేయ (రనౌట్‌) 1; తీక్షణ (నాటౌట్‌) 2; దేశ్‌పాండే (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 182. 
వికెట్ల పతనం: 1–4, 2–86, 3–124, 4–134, 5–140, 6–166, 7–174, 8–175, 9–176. 
బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4–0–38–2, ఒవర్టన్‌ 2–0–30–0, అశ్విన్‌ 4–0–46–1, నూర్‌ అహ్మద్‌ 4–0–28–2, పతిరణ 4–0–28–2, జడేజా 2–0–10–1. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రచిన్‌ (సి) జురేల్‌ (బి) ఆర్చర్‌ 0; త్రిపాఠి (సి) హెట్‌మైర్‌ (బి) హసరంగ 23; రుతురాజ్‌ (సి) జైస్వాల్‌ (బి) హసరంగ 63; శివమ్‌ దూబే (సి) పరాగ్‌ (బి) హసరంగ 18; విజయ్‌శంకర్‌ (బి) హసరంగ 9; జడేజా (నాటౌట్‌) 32; ధోని (సి) హెట్‌మైర్‌ (బి) సందీప్‌ 16; ఒవర్టన్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176. 
వికెట్ల పతనం: 1–0, 2–46, 3–72, 4–92, 5–129, 6–164. 
బౌలింగ్‌: జోఫ్రా ఆర్చర్‌ 3–1–13–1, తుషార్‌ దేశ్‌పాండే 4–0–45–0, సందీప్‌ శర్మ 4–0–42–1, మహీశ్‌ తీక్షణ 4–0–30–0, హసరంగ 4–0–35–4, కార్తికేయ 1–0–10–0.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)