Breaking News

తొలి అంతర్జాతీయ వికెట్‌ సాధించిన ముఖేష్‌ కుమార్‌..

Published on Sat, 07/22/2023 - 21:06

ట్రినిడాడ్‌ వేదికగా భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. 86/1 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభంచిన విండీస్‌ 117 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. 32 పరుగులు చేసిన మెకెంజీ.. ముఖేష్‌ ​కుమార్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ముఖేష్‌ ​కుమార్‌కు ఇదే తొలి అంతర్జాతీయ వికెట్‌ కావడం గమనార్హం.

ఈ మ్యాచ్‌తోనే అతడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇక విండీస్‌ రెండో వికెట్‌ కోల్పోయిన వెంటనే వర్షం మొదలు కావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి విండీస్‌ రెండు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ క్రెగ్‌ బ్రాత్‌వైట్‌ 49 పరుగులతో ఉన్నాడు.

ఇక అంతకుముందు భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 128 ఓవర్లు బ్యాటింగ్ చేసి 438 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటర్లలో కోహ్లి(121) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(80), జడేజా(61) పరుగులతో రాణించారు. విండీస్‌ బౌలర్లలో రోచ్‌, వారికిన్‌ తలా మూడు వికెట్లు సాధించగా.. హోల్డర్‌ రెండు, గాబ్రియల్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌! పంత్‌ రీ ఎంట్రీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)