Breaking News

రాహుల్‌ అజేయ సెంచరీ

Published on Sun, 10/26/2025 - 04:27

పుదుచ్చేరి: రాహుల్‌ సింగ్‌ (174 బంతుల్లో 114 బ్యాటింగ్‌; 12 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీతో చెలరేగడంతో... హైదరాబాద్‌ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా పాండిచ్చేరితో  శనివారం మొదలైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 70 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 255 పరుగులు చేసింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ ఆ్రస్టేలియాతో టి20 సిరీస్‌ ఆడేందుకు వెళ్లడంతో ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టుకు రాహుల్‌ సింగ్‌ సారథిగా వ్యవహరిస్తున్నాడు. 

ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కోల్పోయి ‘డ్రా’ చేసుకున్న హైదరాబాద్‌ జట్టు... ఈ పోరులో సాధికారికంగా ఆడింది. రాహుల్‌ అజేయ శతకంతో ఆకట్టుకోగా... కొడిమ్యాల హిమతేజ (137 బంతుల్లో 62 బ్యాటింగ్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీతో అతడికి అండగా నిలిచాడు. తన్మయ్‌ అగర్వాల్‌ (36), అభిరత్‌ రెడ్డి (35) ఫర్వాలేదనిపించారు. వర్షం కారణంగా మ్యాచ్‌ పూర్తి ఓవర్లపాటు సాగలేదు. పాండిచ్చేరి బౌలర్లలో సాగర్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. రాహుల్, హిమతేజ క్రీజులో ఉన్నారు. 

సత్తా చాటిన సాయితేజ విజయనగరం వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌‘ఎ’ మ్యాచ్‌లో ఆంధ్ర అరంగేట్ర బౌలర్‌ కావూరి సాయితేజ సత్తా చాటాడు. శనివారం ప్రారంభమైన పోరులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బరోడా తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 79 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. విష్ణు సోలంకి (183 బంతుల్లో 99 బ్యాటింగ్‌; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీకి అడుగు దూరంలో నిలిచాడు. 

కెప్టెన్‌ అతీత్‌ సేథ్‌ (122 బంతుల్లో 65 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించాడు. శివాలిక్‌ శర్మ (3), శాశ్వత్‌ రావత్‌ (8), సుకీర్త్‌ పాండే (15), నినాద్‌ రాథ్వా (0), మితేశ్‌ పటేల్‌ (0) విఫలమయ్యారు. జ్యోస్నిల్‌ సింగ్‌ (32) ఫర్వాలేదనిపించాడు. ఆంధ్ర బౌలర్లలో సాయితేజ 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అతడికిదే తొలి మ్యాచ్‌ కాగా... ఈ కుడి చేతివాటం మీడియం పేసర్‌ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. త్రిపురాన విజయ్‌ 2 వికెట్లు తీశాడు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)