Breaking News

యువీ స్పిన్‌ మ్యాజిక్‌.. రాయుడు మెరుపులు! సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్‌​

Published on Sun, 03/02/2025 - 10:08

ఇంటర్నేషనల్ మాస్టర్స్ టీ20 లీగ్‌ టోర్నీలో ఇండియా మాస్టర్స్‌ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం వడోదర వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. భారత బౌలర్లు చెలరేగడంతో 13.5 ఓవర్లలో కేవలం 85 పరుగులకే ఆలౌటైంది.

భారత బౌలర్లలో స్పిన్నర్‌ రాహుల్‌ శర్మ, దిగ్గజ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ మూడు వికెట్లతో సత్తాచాటారు. రాహుల్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇవ్వగా.. యువీ రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసి 12 పరుగులు ఇచ్చాడు. వీరిద్దరితో పాటు నేగీ, బిన్నీ తలా రెండు వికెట్లు సాధించారు.  సౌతాఫ్రికా బ్యాటర్లలో హెన్రీ డేవిడ్స్‌(38) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు

రాయుడు ఆజేయంగా..
అనంతరం 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 11 ఓవర్లలోనే ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్‌ అంబటి రాయుడు(34 బంతుల్లో 7 ఫోర్లతో 41) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. అతడితో పాటు పవన్‌ నేగి(21 నాటౌట్‌) రాణించాడు. 

అయితే భారత కెప్టెన్‌ సచిన్‌ టెండూల్కర్‌ మాత్రం ఈ మ్యాచ్‌లో తన మార్క్‌ను చూపించలేకపోయాడు. సచిన్‌ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక మూడు వికెట్లతో సత్తాచాటిన రాహుల్‌ శర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇక భారత​్‌ తమ తదుపరి మ్యాచ్‌లో మార్చి 5న వడోదర వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.
చదవండి: Champions Trophy: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి..
 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)