Breaking News

కొడుకుతో కలిసి బరిలోకి దిగిన రాహుల్‌ ద్రవిడ్‌.. తండ్రి విఫలం.. కొడుకు హాఫ్‌ సెంచరీ

Published on Sun, 02/23/2025 - 10:22

టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ 12 ఏళ్ల తర్వాత క్లబ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. చిన్న కొడుకు అన్వయ్‌తో కలిసి నసుర్‌ మెమొరియల్‌ షీల్డ్‌ టోర్నీలో పాల్గొన్నాడు. ఈ టోర్నీలో ద్రవిడ్‌ విజయా క్రికెట్‌ క్లబ్‌కు (మాలుర్‌) ప్రాతినిథ్యం వహించాడు. యంగ్‌ లయన్స్‌ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన ద్రవిడ్‌ 8 బంతుల్లో బౌండరీ సాయంతో 10 పరుగులు చేసి ఔటయ్యాడు. 

ఈ మ్యాచ్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ విఫలమైనా కొడుకు అన్వయ్‌ ద్రవిడ్‌ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ అయిన అన్వయ్‌.. 58 బంతుల్లో 8 బౌండరీల సాయంతో 60 పరుగులు చేశాడు. రాహుల్‌-అన్వయ్‌ కొద్ది సేపు కలిసి బ్యాటింగ్‌ చేశారు. వీరిద్దరు 17 బంతుల్లో 15 పరుగులు జోడించారు. క్రికెట్‌ చరిత్రలో తండ్రి కొడుకులు కలిసి ఆడటం చాలా అరుదుగా జరిగింది.

కలిసి క్రికెట్‌ ఆడిన కొంతమంది తండ్రి కొడుకులు..
డబ్ల్యూజీ గ్రేస్‌-గ్రేస్‌ జూనియర్‌
లాలా అమర్‌నాథ్‌-సురిందర్‌ అమర్‌నాథ్‌
డెన్నిస్‌ లిల్లీ-ఆడమ్‌ లిల్లీ
డెనిస్‌ స్ట్రీక్‌- హీథ్‌ స్ట్రీక్‌
శివ్‌నరైన్‌ చంద్రపాల్‌-తేజ్‌ నరైన్‌ చంద్రపాల్‌
ఇయాన్‌ బోథమ్‌-లియామ్‌ బోథమ్‌

ఇలా చేయడం​ ద్రవిడ్‌కు కొత్తేమీ కాదు..!
రిటైర్మెంట్‌ తర్వాత క్లబ్‌ క్రికెట్‌ ఆడటం​ ద్రవిడ్‌కు ఇది కొత్తేమీ కాదు. గతంలో పలుమార్లు తన చిన్ననాటి క్లబ్‌ అయిన బెంగళూరు యునైటెడ్‌ క్రికెట్‌ క్లబ్‌కు ఆడాడు. ఈ జట్టుకు ఆడుతూ ద్రవిడ్‌ ఓ సెంచరీ కూడా చేశాడు.

ద్రవిడ్‌ పెద్ద కొడుకు కూడా క్రికెటరే..!
ద్రవిడ్‌ చిన్న పెద్ద కొడుకు సమిత్‌ ద్రవిడ్‌ కూడా క్రికెటరే. గతేడాది ఆగస్ట్‌లో సమిత్‌ భారత అండర్‌-19 జట్టుకు ఎంపికయ్యాడు. గతేడాది మహారాజా టీ20 టోర్నీలోనే సమిత్‌ పాల్గొన్నాడు.

ఇటీవలే బెంగళూరుకు వచ్చిన ద్రవిడ్‌
రాహుల్‌ ద్రవిడ్‌ ఇటీవలే తన హో సిటీ బెంగళూరుకు వచ్చాడు. బెంగళూరుకు రాక ముందు ద్రవిడ్‌ గౌహతిలో జరిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రీ సీజన్‌ క్యాంప్‌లో పాల్గొన్నాడు. ద్రవిడ్‌ రాయల్స్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సమిత్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో స్వప్నిల్‌ అనే ఆటగాడు సుడిగాలి శతంకంతో విజృంభించడంతో విజయ క్రికెట్‌ క్లబ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. స్వప్నిల్‌ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. యంగ్‌ లయన్స్‌ బౌలర్లలో ఆధిత్య నాలుగు వికెట్లు పడగొట్టాడు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)