Breaking News

రాహుల్‌ ద్రవిడ్‌కు అస్వస్థత

Published on Fri, 01/13/2023 - 22:38

టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉదయం ద్రవిడ్‌ చికిత్స కోసం కోల్‌కతా నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. అదే సమయంలో భారత ఆటగాళ్లతో పాటు శ్రీలంక జట్లు, సహాయక సిబ్బంది మూడో వన్డే కోసం తిరువనంతపురం బయలుదేరింది. స్వల్ప ఆరోగ్య సమస్యలతో శుక్రవారం తెల్లవారు జామున కోల్‌కతా నుంచి బెంగళూరుకు విమానంలో బయలుదేరాడు.

ద్రవిడ్‌ బ్లడ్‌ ప్రెజర్‌(బీపీ) సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. కోల్‌కతాలో వైద్యులు పరీక్షించిన అనంతరం అతను బెంగళూరుకు బయలుదేరాడు. ప్రస్తుతం ద్రవిడ్‌ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నాడని..పరీక్షల అనంతరం శనివారం జట్టుతో చేరే అవకాశాలున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో బెంగళూరు విమానంలో ద్రవిడ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఇప్పటికే 2-0తో సొంతం చేసుకున్న టీమిండియా తిరువనంతపురం వేదికగా జరగనున్న మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తుంది. మరోవైపు షనక నేతృత్వంలోని లంక మాత్రం కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఆశిస్తుంది.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)