Breaking News

ద్రవిడ్‌ తనేంటో నిరూపించుకున్నాడు.. వరల్డ్‌కప్‌లో కూడా: జై షా

Published on Wed, 11/29/2023 - 16:40

మిండియా హెడ్‌ కోచ్‌ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. భారత జట్టు హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించింది. అతడితో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కాంట్రాక్ట్‌లను కూడా బీసీసీఐ పెంచింది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ  కార్యదర్శి  జైషా మాట్లాడుతూ.. భారత క్రికెట్‌ బోర్డు నుంచి పూర్తి మద్దతు ద్రవిడ్‌కు ఉంటుందని తెలిపాడు. కాగా ద్రవిడ్‌ కొత్త కాంట్రాక్ట్‌ వివరాలను మాత్రం బోర్డు బహిర్గతం చేయలేదు. అయితే వచ్చ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌కు ద్రవిడ్‌ హెడ్‌కోచ్‌ పదవిలో కొనసాగే ఛాన్స్‌ ఉంది.

"భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ ద్రవిడ్‌ను మించిన గొప్ప వ్యక్తి లేడని నేను ముందే చెప్పాను. ద్రవిడ్‌ మరోసారి తన  నిబద్ధతతో జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ద్రవిడ్‌ తన కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు ఒప్పుకోవడంతో టీమిండియా యూనిట్‌ మరింత బలంగా మారనుంది. ఇప్పటికే అతడి నేతృత్వంలో టీమిండియా మూడు ఫార్మాట్లలో నెం1 జట్టుగా అవతరించింది.

ఇది ఒక్కటి చాలు అతడి కోచింగ్‌ ఎలా ఉందో తెలుసుకోవడానికి. కోచ్‌గా తనంటో ద్రవిడ్‌ నిరూపించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో కూడా భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన తర్వాత దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓటమిపాలైంది. హెడ్‌కోచ్‌ ద్రవిడ్‌కు బోర్డు నుంచి ఎల్లప్పడూ సపోర్ట్‌ ఉంటుంది. భారత జట్టును అంతర్జాతీయ స్దాయిలో మరింత అద్బుతంగా ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాని" జై షా పేర్కొన్నాడు. కాగా ద్రవిడ్‌ తిరిగి మళ్లీ ద‍క్షిణాఫ్రికా పర్యటనకు ముందు జట్టుతో కలవనున్నాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)