నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం
Breaking News
అఫ్గానిస్తాన్ కొత్త కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్.. ఎవరంటే?
Published on Wed, 07/22/2026 - 18:41
అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తమ వన్డే,టెస్ట్ జట్టు కెప్టెన్‌గా సీనియర్ బ్యాటర్ రహమత్ షాను ఏసీబీ నియమించింది. సుదీర్ఘకాలం కెప్టెన్‌గా వ్యవహరించిన హష్మతుల్లా షాహిదీ స్ధానాన్ని 33 ఏళ్ల రహమత్ షా భర్తీ చేయనున్నాడు.
అదేవిధంగా టెస్ట్, వన్డేల్లో రహమత్ డిప్యూటీగా స్టార్ వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఎంపికయ్యాడు. కాగా రహమత్ షా 2021 నుంచి అఫ్గానిస్తాన్ జట్టు వైస్ కెప్టెన్‌గా సేవలందిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతడికి ఉన్న సుదీర్ఘ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని జట్టు పగ్గాలను అఫ్గాన్ క్రికెట్ అప్పగించింది.
"రహమత్ అపారమైన అనుభవం ఉంది. అతడు జట్టును సమర్ధవంతంగా నడిపించగలడని భావిస్తున్నాం. కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్న రహమత్ షా, గుర్బాజ్లకు శుభాకాంక్షలు" అని ఏసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐర్లాండ్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి కెప్టెన్‌గా రహమత్ తన ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నాడు.
ఇక హష్మతుల్లా షాహిదీ విషయానికి వస్తే.. కెప్టెన్‌గా అఫ్గానిస్తాన్‌కు అద్భుతమైన విజయాలు అందించాడు. అతడి నాయకత్వంలోని అఫ్గాన్ 2023 వన్డే ప్రపంచకప్‌లో సంచలనాలు సృష్టించింది. ఆ టోర్నీలో ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి బలమైన జట్టను ఓడించి అఫ్గాన్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
మొత్తంగా అతడి కెప్టెన్సీలో అఫ్గాన్ జట్టు 55 వన్డేలు ఆడగా, అందులో 27 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అఫ్గాన్ టీ20 జట్టుకు రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: వన్డే వరల్డ్‌కప్-2027కు భారత జట్టు ఇదే? భువనేశ్వర్‌కు చోటు?
Tags : 1