Breaking News

గుర్బాజ్‌ ఊచకోత.. ఒక్క బౌండరీ లేదు.. అన్నీ సిక్సర్లే..!

Published on Sun, 09/08/2024 - 14:33

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా సెయింట్‌ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్‌ వారియర్స్‌ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 19 బంతుల్లో 7 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. 101 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో మాథ్యూ ఫోర్డ్‌ వేసిన మూడో ఓవర్‌లో గుర్బాజ్‌ శివాలెత్తిపోయాడు. 

హ్యాట్రిక్‌ సిక్సర్లు సహా మొత్తం నాలుగు సిక్సర్లు బాదాడు. గుర్బాజ్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ లేదు. అన్నీ సిక్సర్లే. గుర్బాజ్‌ ఊచకోత ధాటికి వారియర్స్‌ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలో ఛేదించింది. గుర్బాజ్‌కు జతగా టిమ్‌ రాబిన్సన్‌ (20 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. 

వారియర్స్‌ ఇన్నింగ్స్‌లో షాయ్‌ హోప్‌ 11, ఆజమ్‌ ఖాన్‌ 0, హెట్‌మైర్‌ 8, కీమో పాల్‌ 1 పరుగు చేశారు. లూసియా కింగ్స్‌ బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ 3 వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లూసియా కింగ్స్‌.. గుడకేశ్‌ మోటీ (3.3-0-16-3), ఇమ్రాన్‌ తాహిర్‌ (4-0-29-3), కీమో పాల్‌ (2-0-19-2), ప్రిటోరియస్‌ (2-0-10-1) ధాటికి 14.3 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటైంది. లూసియా కింగ్స్‌ ఇన్నింగ్స్‌లో మాథ్యూ ఫోర్డ్‌ (31), జాన్సన్‌ ఛార్లెస్‌ (19), టిమ్‌ సీఫర్ట్‌ (12), అకీమ్‌ అగస్ట్‌ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ గెలుపుతో వారియర్స్‌ సీజన్‌లో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. లూసియా కింగ్స్‌ సీజన్‌ తొలి ఓటమిని ఎదుర్కొంది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)