Breaking News

ర‌వీంద్ర సూప‌ర్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ స్కోరంతంటే?

Published on Fri, 10/18/2024 - 11:50

Update: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 356 ప‌రుగుల భారీ ఆధిక్యం ల‌భించింది. 

బెంగ‌ళూరు వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఆధిపత్యం కొన‌సాగుతోంది. తొలుత బౌలింగ్‌లో భార‌త్‌ను క‌ట్ట‌డి చేసిన కివీస్‌.. ఇప్పుడు బ్యాటింగ్‌లో కూడా అద‌ర‌గొడుతోంది. 

తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశ‌గా బ్యాక్ క్యాప్స్ జ‌ట్టు అడుగులు వేస్తోంది. మూడో రోజు లంచ్ స‌మ‌యానికి న్యూజిలాండ్ 7 వికెట్ల న‌ష్టానికి 345 ప‌రుగులు చేసింది. కివీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 299 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

క్రీజులో ర‌చిన్ ర‌వీంద్ర‌(104), టిమ్ సౌథీ(49) ప‌రుగుల‌తో ఉన్నారు. అయితే 180/3 ఓవ‌ర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట‌ను ప్రారంభించిన కివీస్‌కు ఆదిలోనే గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. స్టార్ బ్యాట‌ర్ డార్లీ మిచెల్‌ను సిరాజ్ పెవిలియ‌న్‌కు పంపాడు. ఆ త‌ర్వాత వికెట్ కీప‌ర్ బ్లాండెల్‌ను బుమ్రా ఔట్ చేయ‌గా, గ్లెన్ ఫిలిప్స్ జ‌డేజా బోల్తా కొట్టించాడు.

కేవ‌లం 40 ప‌రుగుల వ్య‌వ‌ధిలోనే న్యూజిలాండ్ 3 కీల‌క వికెట్లు కోల్పోయింది. దీంతో భార‌త్ తిరిగి గేమ్‌లోకి వ‌చ్చింద‌ని అంతా భావించారు. కానీ క్రీజులో ఉన్న ర‌చిన్ ర‌వీంద్ర మాత్రం అంద‌రి అంచనాల‌ను తారుమారు చేశాడు.

ర‌వీంద్ర సూప‌ర్ సెంచరీ..
వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోయిన‌ప్ప‌ట‌కి ర‌వీంద్ర మాత్రం భార‌త బౌల‌ర్ల‌పై ఎదురు దాడికి దిగాడు. వెట‌ర‌న్ ప్లేయ‌ర్ టిమ్ సౌథీతో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఈ క్ర‌మంలో 124 బంతుల్లో త‌న రెండో టెస్టు సెంచ‌రీ మార్క్‌ను ర‌వీంద్ర అందుకున్నాడు.

 అత‌డి ఇన్నింగ్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 11 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. మ‌రోవైపు టిమ్ సౌథీ కూడా భార‌త బౌల‌ర్ల‌ను ఓ ఆట ఆడేసికుంటున్నాడు. హాఫ్ సెంచ‌రీకి ఒక్క ప‌రుగు దూరంలో సౌథీ ఉన్నాడు. వీరిద్ద‌రూ ఎనిమిదో వికెట్‌కు 112 ప‌రుగుల ఆజేయ భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)