Breaking News

ఐపీఎల్‌-2025లో బోణీ కొట్టిన సీఎస్‌కే.. ముంబైపై విక్టరీ

Published on Sun, 03/23/2025 - 23:24

ఐపీఎల్‌-2025ను చెన్నై సూపర్ కింగ్స్ అద్బుతమైన విజయంతో ఆరంభించింది. చెపాక్ వేదికగా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. చెన్నై బ్యాటర్లలో రచిన్‌ రవీంద్ర(65 నాటౌట్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌(53) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. ఓ దశలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పటికి.. రవీంద్ర మాత్రం ఆచితూచి ఆడుతూ మ్యాచ్‌ను ముగించాడు.

ముంబై బౌలర్లలో విఘ్నేష్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్‌ చాహర్‌, జాక్స్‌ తలా వికెట్‌ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో తిల‌క్ వ‌ర్మ‌(31) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ఆఖ‌రిలో దీప‌క్ చాహ‌ర్‌(28) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. రోహిత్‌ శర్మ(0) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఇక సీఎస్‌కే బౌల‌ర్ల‌లో నూర్ అహ్మ‌ద్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఖాలీల్ అహ్మ‌ద్ మూడు వికెట్లు సాధించాడు.
చ‌ద‌వండి: IPL 2025: వారెవ్వా ధోని.. కేవ‌లం 0.12 సెక‌న్ల‌లోనే! వీడియో వైర‌ల్‌

Videos

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు