Breaking News

కరుణ్‌ నాయర్‌ గుడ్‌ బై.. జట్టులోకి మరో కర్ణాటక ఆటగాడు

Published on Wed, 08/27/2025 - 18:27

డిఫెండింగ్‌ రంజీ ఛాంపియన్స్‌ విదర్భకు మరో కర్ణాటక ఆటగాడు వలస రావడం దాదాపుగా ఖరారైంది. గణేశ్‌ సతీశ్‌, కరుణ్‌ నాయర్‌ లాంటి ఆటగాళ్లు కర్ణాటక నుంచి వలస వచ్చి విదర్భ తరఫున సత్తా చాటారు. తాజాగా వీరి బాటలో రవికుమార్‌ సమర్థ్‌ కూడా నడువనున్నాడు. రానున్న దేశవాలీ సీజన్‌ కోసం​ సమర్థ్‌ విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడు. 

డీల్‌ కూడా ఒకే అయినట్లు తెలుస్తుంది. సమర్థ్‌ కర్ణాటకకు చెందిన వాడే అయినప్పటికీ గత సీజన్‌లో ఉత్తరాఖండ్‌కు వలస వెళ్లాడు. అక్కడ సెట్‌ కాకపోవడంతో విదర్భవైపు మొగ్గు చూపుతున్నాడు.

సమర్థ్‌ను ఇటీవలే విదర్భను వదిలిపెట్టిన కరుణ్‌ నాయర్‌కు ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. 32 ఏళ్ల సమర్థ్‌ గతేడాది మినహా కెరీర్‌ మొత్తం కర్ణాటకకే ఆడాడు. కరుణ్‌ నాయర్‌ లాగే కుడి చేతి వాటం టాపార్డర్‌ బ్యాటర్‌ అయిన సమర్థ్‌.. 2013లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ అరంగేట్రం చేసి 95 మ్యాచ్‌ల్లో 15 సెంచరీలు, 35 అర్ద సెంచరీల సాయంతో 6157 పరుగులు చేశాడు. 71 లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో 10 సెంచరీలు, 17 అర్ద సెంచరీల సాయంతో 3050 పరుగులు చేశాడు. 30 టీ20ల్లో ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 459 పరుగులు చేశాడు.

సమర్థ్‌ గత సీజన్‌లో ఉత్తరాఖండ్‌ తరఫున కూడా సత్తా చాటాడు. ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 649, లిస్ట్‌-ఏలో 385, టీ20ల్లో 184 పరుగులు చేశాడు. సమర్థ్‌ ఎలా చూసుకున్నా కరుణ్‌ నాయర్‌కు తగ్గ ఆటగాడిగా ఉంటాడు కాబట్టి, విదర్భ అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే సాహసం చేయకపోవచ్చు.

కరుణ్‌ గత రంజీ సీజన్‌లో విదర్భను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆతర్వాత అతను వ్యక్తిగత కారణాల చేత స్వరాష్ట్రమైన కర్ణాటకకు తిరిగి వెళ్లాడు. కరుణ్‌ గత రంజీ సీజన్‌లో విదర్భ తరఫున 9 మ్యాచ్‌ల్లో 863 పరుగులు చేశాడు. కరుణ్‌ స్థానాన్ని భర్తీ చేసుకోవడం విదర్భకు కష్టమే అయినప్పటికీ.. సమర్థ్‌ అతనికి ప్రత్యామ్నాయం కాగలడు.

కరుణ్‌కు ముందు గణేశ్‌ సతీశ్‌ కూడా విదర్భ తరఫున అద్భుతంగా ఆడాడు. గణేశ్‌ ఏకంగా తొమ్మిది సీజన్ల పాటు (2014-23) విదర్భకు సేవలందించాడు. 
 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)