Breaking News

అత‌డిపై మీకు న‌మ్మ‌కం లేదా? మ‌రెందుకు సెలెక్ట్‌ చేశారు?

Published on Tue, 12/02/2025 - 15:38

రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 అధిక్యంలో భారత్‌ దూసుకెళ్లింది. అయితే తొలి మ్యాచ్‌లో గెలుపొందినప్పటికి జట్టు ఎంపికపై మాత్రం స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్  అసంతృప్తి వ్యక్తం చేశాడు.

రాంచీ వన్డేలో ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కించుకోకపోవడాన్ని అశ్విన్ తప్పు బట్టాడు. ఆసియాకప్‌లో గాయపడ్డ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో సౌతాఫ్రికాతో వన్డేలకు నితీశ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. 

అయితే తొలి వన్డే తుది జట్టులో నితీశ్ ఉంటాడని అంతా భావించారు. కానీ టీమ్ మెనెజెమెంట్ మాత్రం ప్లేయింగ్ ఎలెవన్‌లో నితీశ్ బదులుగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశమిచ్చింది. కానీ సుందర్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. ఈ క్రమంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. రెండో వన్డేలోనైనా నితీశ్‌ను ఆడించాలని పలువురు సూచిస్తున్నారు.

"జట్టులో హార్దిక్ పాండ్యా లేనప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి కచ్చితంగా చోటు ఇవ్వాలి. ఒకవేళ నితీశ్ జట్టులో ఉన్నప్పటికి అతడిని బెంచ్‌కే పరిమితం చేస్తే కచ్చితంగా టీమ్ సెలక్షన్‌లో తప్పుందనే చెప్పాలి. తుది జట్టులో ఆడించినప్పుడు నితీశ్‌ను ఎందుకు ఎంపిక చేశారు? హార్దిక్ ఏమి చేయగలడో నితీశ్ కూడా అదే చేయగలడు. 

అతడికి అవకాశాలు ఇస్తే మరింత రాటుదేలుతాడు. కానీ అతడు ఎక్కువ శాతం బెంచ్‌కే పరిమితం చేస్తున్నారు. అటువంటి అప్పుడు అతడి ప్రధాన జట్టుకే ఎంపిక చేయడం మానేయండి" అని తన యూట్యూబ్ ఛానల్‌లో అశూ పేర్కొన్నాడు.
చదవండి: Ashes 2025-26: అనుకున్న‌దే జ‌రిగింది..! ఆస్ట్రేలియా భారీ షాక్‌

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు