Breaking News

అశ్విన్‌ కీలక నిర్ణయం

Published on Thu, 08/28/2025 - 17:05

భారత వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ నిన్న (ఆగస్ట్‌ 27) ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదివరకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు.. భారత క్రికెట్‌తో తన బంధాన్ని పూర్తిగా తెంచుకున్నాడు. ఐపీఎల్‌ రిటైర్మెంట్‌ తర్వాత అశ్విన్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇంగ్లండ్‌ వేదికగా జరిగే హండ్రెడ్‌ లీగ్‌లో ఆడేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాడని సమాచారం. అలాగే ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా దేశాల్లో జరిగే టీ20 లీగ్‌ల్లో కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు పలు ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరుగుతున్నాయట.

బీసీసీఐ నియమాల ప్రకారం.. భారత ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్‌ ప్రకటిస్తేనే విదేశీ లీగ్‌ల్లో ఆడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం​ అశ్విన్‌కు భారత క్రికెట్‌తో కాని, ఐపీఎల్‌తో కాని సంబంధాలు లేవు. కాబట్టి యాష్‌కు విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. విదేశీ లీగ్‌ల్లో పాల్గొనాలనుకునే విషయాన్ని అశ్విన్‌ తన ఐపీఎల్‌ రిటైర్మెంట్‌ సందేశంలో పరోక్షంగా ప్రస్తావించాడు.

37 ఏళ్ల ఆశ్విన్‌ 2009లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసి, 2025లో అదే ఫ్రాంచైజీ తరఫున తన చివరి మ్యాచ్‌ ఆడాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో మొత్తం 221 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు తీశాడు. సీఎస్‌కేతో రెండు టైటిళ్లు సాధించాడు. పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ వంటి జట్లకు సేవలందించారు. కొన్ని మ్యాచ్‌ల్లో పంజాబ్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 16 సంవత్సరాల పాటు ఐపీఎల్‌లో తన మాయాజాలాన్ని ప్రదర్శించిన అశ్విన్‌.. త్వరలో విదేశీ లీగ్‌ల్లో కూడా సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు