భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్‌, భువనేశ్వర్‌కు చోటు!

Published on Thu, 06/04/2026 - 12:18

ఐపీఎల్ 2026 సీజన్ దాదాపు రెండు నెలల పాటు అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. ఒకవైపు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డులు సృష్టిస్తే, మరోవైపు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన క్లాస్ ఏంటో చూపించాడు.

అంతేకాకుండా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్, యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ వంటి వారు కూడా అంచనాలకు మించి రాణించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2026 ప్రదర్శనల ఆధారంగా ప్రత్యామ్నాయ భారత టీ20 జట్టును దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ ఎంపిక చేశాడు. 

ఈ 15 మంది సభ్యుల జట్టులో ఆర్సీబీ నుంచి అత్యధిక నలుగురు ఆటగాళ్లకు అశ్విన్ చోటిచ్చాడు. కానీ తన మాజీ జట్టు సీఎస్‌కే నుంచి మాత్రం అతడు కేవలం కేవలం ఒకే ఒక్కరికే అవకాశం ఇచ్చాడు. ఆర్సీబీ నుంచి ఛాన్స్ లభించిన వారిలో దేవ్‌దత్త్‌ పడిక్కల్‌, కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కృనాల్‌ పాండ్యా ఉన్నారు. 

విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో అతడిని అశ్విన్‌ పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఈ జట్టులో ఓపెనర్లగా రాజస్తాన్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ, ఢిల్లీ సీనియర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ను అశ్విన్‌ ఎంపిక చేశాడు. మిడిలార్డర్‌లో పడిక్కల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రజత్‌ పాటిదార్‌ వంటి స్టార్లకు అవకాశమిచ్చాడు. 

ఆల్‌రౌండర్ల కోటాలో నితీశ్‌ కుమార్‌ రెడ్డి, కృనాల్‌ పాండ్యాకు ఛాన్స్‌ దక్కింది. ఫినిషర్‌గా ఢిల్లీ ఆటగాడు అశుతోష్‌ శర్మను ఈ స్పిన్‌ మాంత్రికుడు సెలక్ట్‌ చేశాడు. అయితే అశ్విన్‌ తన ఎంచుకున్న జట్టులో స్పిన్నర్లగా శివాంగ్ కుమార్, హర్ష్‌దూబేలకు అవకాశమివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. 

అయితే అశ్విన్‌ తన ఎంచుకున్న జట్టులో స్పిన్నర్లగా శివాంగ్ కుమార్, హర్ష్‌దూబేలకు అవకాశమివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. వీరిద్దరూ ఈ ఏడాది సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక రాజస్తాన్‌ నుంచి వైభవ్‌తో పాటు ధ్రువ్‌ జురెల్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. ఫాస్ట్‌ బౌలర్ల కోటాలో భువనేశ్వర్‌ కుమార్‌తో పాటు మహ్మద్‌ షమీ, అన్షుల్‌ కాంబోజ్‌లకు అశ్విన్‌ ఛాన్స్‌ ఇచ్చాడు.

అశ్విన్ ఎంపిక చేసిన ప్రత్యామ్నాయ భారత టీ20 జట్టు ఇదే
వైభవ్ సూర్యవంశీ, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శ్రేయాస్ అయ్యర్, రజత్ పాటిదార్, నితీష్ కుమార్ రెడ్డి, అశుతోష్ శర్మ, కృనాల్ పాండ్యా, శివంగ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, అన్షుల్ కాంబోజ్, హర్ష్ దూబే, మహమ్మద్ షమీ, ధృవ్ జురెల్
చదవండి: ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ కొంప‌ముంచింది: సచిన్
 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)