Breaking News

శ్రీలంకతో తొలి టెస్ట్‌.. భారత తుది జట్టు ఇదే? అతడి అరంగేట్రం ఫిక్స్‌?

Published on Wed, 07/29/2026 - 13:07

శ్రీలంక‌తో జ‌రగ‌నున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును బీసీసీఐ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. అయితే ఈ సిరీస్‌కు 33 ఏళ్ల ఆఫ్‌ స్పిన్నర్ సారాన్ష్ జైన్‌ను ఎంపిక చేసి సెల‌క్ట‌ర్లు అంద‌ర‌ని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. వాషింగ్టన్ సుందర్ ఫిట్‌గా లేకపోవడంతో జైన్‌కు తొలిసారి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కింది.

కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 54 ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడిన సారాన్ష్‌ 27.30 సగటుతో 188 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్‌కు దూరంగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా, సాయిసుదర్శన్‌లను ఎంపిక చేసినప్పటికి సిరీస్ ఆరంభానికి ముందు వారు తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. 

ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి లంకతో జరగబోయో తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను  భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అంచనా వేశాడు. అన్‌క్యాప్డ్స్ ఆటగాడు సారాన్ష్ జైన్ అరంగేట్రం చేసే అవకాశముందని అశ్విన్ తెలిపాడు.

"ప్లేయింగ్ ఎలెవన్‌లో రవీంద్ర జడేజా కచ్చితంగా ఉంటాడు. అదేవిధంగా అఫ్గానిస్తాన్‌తో ఏ​కైక టెస్ట్ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్‌ను కూడా తుది జట్టులో కొనసాగిస్తారు. వీరిద్దరితో పాటు కుల్దీప్ యాదవ్‌కు కూడా అవకాశమివ్వాలి. దీంతో జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉంటారు. 

శ్రీలంక పిచ్‌లు ఎక్కువగా స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి సారాన్ష్ జైన్‌ను కూడా ఆడిస్తే బెటర్‌. అతడిని ఏడో స్ధానంలో బ్యాటింగ్ పంపాలి. ఎప్పటిలాగే ఓపెనర్లగా కేఎల్ రాహుల్‌, యశస్వి జైశ్వాల్ ఉంటారు. మూడువ స్థానంలో దేవదత్ పడిక్కల్ లేదా సాయి సుదర్శన్‌కు ఛాన్స్ దక్కనుంది. 

సాయి ఫిట్‌నెస్ సాధిస్తే దాదాపుగా అతడే తుది జట్టులో ఉంటాడు. నాలుగు, ఐదు స్ధానాల్లో వరుసగా శుబ్‌మన్ గిల్‌, రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు వస్తారు. ఆరో స్ధానంలో జడేజాను పంపాలి. ఇక చివరగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లను తీసుకోవాలి. బుమ్రా ఫిట్‌గా లేకపోతే ప్రసిద్ద్ కృష్ణకు ఛాన్స్ ఇవ్వాలని" తన య్యూటూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.

అశ్విన్ అంచ‌నా వేసిన భార‌త తుది జ‌ట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), సాయి సుదర్శన్*,  రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా*, సిరాజ్, సరాన్ష్ జైన్.

శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), సాయి సుదర్శన్*, ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా*, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరాన్ష్ జైన్.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)