Breaking News

కనీసం మూడో మ్యాచ్‌లోనైనా ఆడించండి: అశ్విన్‌

Published on Fri, 01/16/2026 - 16:56

రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఘోర ప‌ర‌భావం ఎదురైన సంగతి తెలిసిందే. భారత్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్‌.. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ ఆదివారం(జనవరి 18) ఇండోర్ స్టేడియం వేదికగా జరగనుంది.

అయితే తొలి రెండు వన్డేల్లో భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అర్ష్‌దీప్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి అతడికి తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్‌, ప్రసిద్ద్ కృష్ణల వైపు టీమ్ మెనెజ్‌మెంట్ మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్‌ను కనీసం మూడో వన్డేలోనైనా తుది జట్టులోకి తీసుకోవాలని హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌ను భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు.

"బౌలర్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లకు అయితే హిట్-ది-డెక్ బౌలర్ అవసరం. కానీ న్యూజిలాండ్‌తో అటువంటి బౌలర్లు అవసరం లేదు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ విషయాన్ని నేను ఆర్ధం చేసుకోగలను. కానీ అర్ష్‌దీప్ గురుంచి ఎవరూ ఆలోచించడం లేదు.

అతడు ఎంతో కష్టపడి ఈ స్ధాయికి చేరుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో జట్టు విజయాల్లో భాగమయ్యాడు. అయినా ఇప్పటికీ అతడు జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడు. బ్యాటర్ల విషయంలో ఇలా ఎప్పుడూ జరగదు. ప్రతీసారి బౌలర్లే బలి అవుతున్నారు.

అత్యుత్తమంగా రాణించినా బౌలర్లు కూడా తమ చోటును కాపాడుకోవడానికి నిరంతరం పోరాడాల్సి వస్తోంది. ఎక్కువ కాలం మ్యాచ్‌లు ఆడకుండా బెంచ్‌పై  కూర్చోబెడితే, ఎంతటి గొప్ప బౌలర్ అయినా తన రిథమ్‌ను కోల్పోవాల్సి వస్తుంది. కనీసం మూడో వన్డేలోనైనా అతడికి ఛాన్స్ ఇవ్వండి" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: T20 WC 2026: అతడి కోసం​ బీసీసీఐ 'ప్లాన్‌ బి'.. రేసులో స్టార్‌ ప్లేయర్లు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)