Breaking News

'టీమిండియా బజ్‌బాల్‌ ఆడితే జట్టులో ఎవరు మిగలరండి'

Published on Wed, 08/02/2023 - 16:10

బజ్‌బాల్‌ ఆటతీరుతో టెస్టు క్రికెట్‌కు కొత్త నిర్వచనం చెప్పింది ఇంగ్లండ్‌ జట్టు. కెప్టెన్‌గా స్టోక్స్‌, హెడ్‌కోచ్‌గా బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ బాధ్యతలు తీసుకున్నాకా బజ్‌బాల్‌ ఆటకు మరింత పదును పెట్టింది. సౌతాఫ్రికా, పాకిస్తాన్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లో బజ్‌బాల్‌ దూకుడుతో సిరీస్‌ విజయాలను సొంతం చేసుకున్న ఇంగ్లండ్‌ యాషెస్‌ సిరీస్‌లోనూ అదే దూకుడు చూపెట్టాలని భావించింది.

అయితే తొలి రెండు టెస్టుల్లో బజ్‌బాల్‌ ఆటతీరుతో ఇంగ్లండ్‌ చేతులు కాల్చుకుంది. అప్పటికే డబ్ల్యూటీసీ టైటిల్‌ గెలిచి డిపెండింగ్‌ చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌కు ముకుతాడు వేసింది. తొలి రెండు టెస్టులను గెలిచి ఆసీస్‌ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఓటమిపాలైన తమ బజ్‌బాల్‌ దూకుడు మాత్రం ఆపమని కెప్టెన్‌ స్టోక్స్‌ కుండబద్దలు కొట్టాడు.

అదే బజ్‌బాల్‌ ఆటతీరుతో మూడో టెస్టును గెలిచిన ఇంగ్లండ్‌ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. నాలుగో టెస్టు డ్రాగా ముగిసినా ఐదో టెస్టు గెలిచి 2-2తో సిరీస్‌ను సమం చేసింది. ఇక వచ్చే ఏడాది టీమిండియా గడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌ వస్తోంది. బజ్‌బాల్‌ ఆటతీరును టీమిండియాకు పరిచయం చేస్తామని స్టోక్స్‌ పేర్కొనడం ఆసక్తి కలిగించింది.

అయితే ఇదే బజ్‌బాల్‌ స్టైల్ ను ఇండియన్ టీమ్ కూడా ఫాలో అయితే ఎలా ఉంటుందన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఈ విషయంపై అశ్విన్ స్పందించాడు. "మేము టెస్ట్ క్రికెట్ బాగా ఆడుతున్నాం. కానీ త్వరలోనే పరివర్తన దిశగా వెళ్తున్నాం. ఆ దశలో పరిస్థితులు అంత సులువుగా ఉండవు. కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ ఈ దశలో ఇండియా బజ్‌బాల్ స్టైల్ అడాప్ట్ చేసుకుందని అనుకుందాం. హ్యారీ బ్రూక్ లాగా మన ప్లేయర్స్ కూడా బ్యాట్ ఝుళిపించడానికి ప్రయత్నించారని అనుకుందాం.

రెండు మ్యాచ్ లు ఓడిపోతాం. మనం ఏం చేస్తాం? బజ్‌బాల్ కు, ప్లేయర్స్ కు మద్దతిస్తామా? కనీసం నలుగురు ప్లేయర్స్ పై వేటు వేస్తాం. మన సంస్కృతి ఎప్పుడూ ఇలాగే ఉంది. ఇతరుల స్టైల్ వాళ్లకు మంచి ఫలితాలు ఇచ్చింది కదా అని మనం కాపీ చేయలేం. వాళ్లకు అది పని చేసింది ఎందుకంటే వాళ్ల మేనేజ్‌మెంట్, సెలక్టర్లు ఈ స్టైల్ ను ఆమోదించారు. మద్దతిచ్చారు. వాళ్ల అభిమానులు కూడా ఆమోదించారు. మనం అది చేయలేం" అని అశ్విన్ స్పష్టం చేశాడు.

ఇక వన్డే వరల్డ్ కప్ పై కూడా అశ్విన్ స్పందించాడు. అభిమానులు ఇండియన్ టీమ్ కు సానుకూలంగా మద్దతివ్వాలని కోరాడు. "వరల్డ్ కప్ గెలవడం అంత సులువు కాదు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ వన్డే వరల్డ్‌కప్‌ మన దేశంలో జరుగుతుంది. గతాన్ని గుర్తుచేయొద్దు.. అప్పుడు ధోని సేన మ్యాజిక్‌ చేసింది. ఇప్పుడు అదే రిపీట్‌ అవుతుందని కచ్చితంగా చెప్పలేం. దాదాపు ప్రతి మేజర్ టోర్నమెంట్లో మనం సెమీఫైనల్ చేరాం. ఆ రోజు సరిగా ఆడలేకపోయాం అంతే" అని అశ్విన్ అన్నాడు.

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)