Breaking News

చ‌రిత్ర సృష్టించిన అశ్విన్‌.. కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డు బద్దలు

Published on Fri, 09/27/2024 - 14:38

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా స్టార్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా కాన్పూర్ వేదిక‌గా బంగ్లాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ మ‌రో అరుదైన రికార్డ‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఆసియాలో అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన  భారత బౌలర్‌గా యాష్ రికార్డులకెక్కాడు.

తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా కెప్టెన్  నజ్ముల్ హొస్సేన్ శాంటోను ఔట్ చేసిన అశ్విన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అశ్విన్ ఇప్పటివరకు ఆసియాలో 420 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. 

కుంబ్లే తన కెరీర్‌లో ఆసియాలో 419 వికెట్లు సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో శ్రీలంక లెజెండ్‌ ముత్తయ్య మురళీధరన్‌ 612 వి​కెట్లతో తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్ధానంలో అశ్విన్‌(420) ఉన్నాడు. అశ్విన్‌ తర్వాత స్ధానాల్లో కుంబ్లే, రంగనా హెరత్‌(354), హార్భజన్ సింగ్‌(300) ఉన్నారు. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్‌లో 101 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌.. 2.82 ఏకానమీతో 522 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)