ఐపీఎల్‌పై రూ. 7.50 ల‌క్ష‌ల ప్ర‌శ్న‌.. సమాధానం మీకు తెలుసా?

Published on Tue, 08/19/2025 - 11:31

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’.. ఇండియాలో మోస్ట్ పాపుల‌ర్ రియాలిటీ గేమ్ షోల‌లో ఒక‌టి.  ఎన్నో సీజన్ల నుంచి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటున్న ఈ షో తాజాగా 17వ సీజన్‌ నడుస్తోంది. ఈ సీజ‌న్‌లో కూడా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అయితే గ‌త వారంలో కంటెస్టెంట్‌ల‌కు క్రికెట్‌కు సంబంధించి ప‌లు ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్‌పై సెంచ‌రీతో చేసిన భార‌త ఆట‌గాడు ఎవ‌రు అన్న ప్ర‌శ్న హోస్ట్ అమితాబ్ అడిగారు. ఈ ప్రశ్నకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. 

ఇందుకు స‌మాధానం ఆప్షన్ బి విరాట్ కోహ్లి. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో చిరకాల ప్ర‌త్య‌ర్ధిపై కోహ్లి  అద్బుత‌మైన సెంచ‌రీతో మెరిశాడు. కాగా ఈ ప్ర‌శ్న "సూపర్ సాండూక్" అనే స్సెషల్‌ రౌండ్‌లో భాగంగా అడిగారు. ఈ రౌండ్‌లో మొత్తం పది ప్రశ్నలు ఉంటాయి. 

ఒక్కో ప్రశ్నకు పదివేలు. మొత్తం పది ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే లక్ష రూపాయలు బహుమతిగా లభించనుంది. అదేవిధంగా మరో కంటెస్టెంట్‌కు రూ. 7.50 ల‌క్ష‌లకు గానూ ఐపీఎల్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్‌ చరిత్రలో రెండు సార్లు ప‌ర్పుల్ క్యాప్ గెల‌వ‌ని ప్లేయ‌ర్ ఎవ‌రు? అన్న ప్ర‌శ్న అమితాబ్ అడిగారు. 

ఇందుకు ఆప్ష‌న్స్‌గా ఎ. ల‌సిత్ మ‌లింగ‌, బి.హర్ష‌ల్ ప‌టేల్‌, సి. డ్వేన్ బ్రావో, డి. భువ‌నేశ్వ‌ర్ కుమార్‌. స‌రైన స‌మాధ‌నం అప్ష‌న్‌ ఎ. లసిత్ మ‌లింగ.  మ‌లింగ మిన‌హా హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, డ్వేన్ బ్రావో, భువ‌నేశ్వ‌ర్ ఐపీఎల్‌లో రెండు సార్లు ప‌ర్పుల్ క్యాప్ హోల్డ‌ర్‌గా నిలిచారు.
చదవండి: AUS vs SA: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. సౌతాఫ్రికాకు భారీ షాక్‌
 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)