పీవీఎల్‌ చాంపియన్‌ బెంగళూరు

Published on Mon, 10/27/2025 - 04:24

సాక్షి, హైదరాబాద్‌: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) నాలుగో సీజన్‌లో బెంగళూరు టోర్పిడోస్‌ జట్టు చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్లో బెంగళూరు టోర్పిడోస్‌ 15–13, 16–4, 15–13తో ముంబై మిటియోస్‌ జట్టును ఓడించింది. అమెరికాకు చెందిన మ్యాట్‌ వెస్ట్‌ సారథ్యంలోని బెంగళూరు జట్టు ఫైనల్లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. లీగ్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన ముంబై జట్టు ఫైనల్లో తేలిపోయింది. 

మరో అమెరికా ప్లేయర్‌ జెలెన్‌ పెన్‌రోజ్, భారత్‌కు చెందిన సేతు, జోయల్‌ బెంజమిన్, జిష్ణు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బెంగళూరుకు తొలిసారి పీవీఎల్‌ టైటిల్‌ను అందించారు. ముంబై తరఫున కెప్టెన్  అమిత్‌ గులియా, ఓం లాడ్‌ వసంత్, శుభమ్‌ ఆకట్టుకున్నారు. విజేతగా నిలిచిన బెంగళూరు జట్టుకు రూ. 40 లక్షలు... రన్నరప్‌ ముంబై జట్టుకు రూ. 30 లక్షలు ప్రైజ్‌మనీ లభించింది. 

పీవీఎల్‌ ‘బెస్ట్‌ బ్లాకర్‌’గా ప్రిన్స్‌ మలిక్‌ (గోవా గార్డియన్స్‌)... ‘బెస్ట్‌ అటాకర్‌’గా జోయల్‌ బెంజమిన్‌ (బెంగళూరు)... ‘బెస్ట్‌ సర్వర్‌’గా సేతు (బెంగళూరు)... ‘బెస్ట్‌ సెట్టర్‌’గా వసంత్‌ (ముంబై)... ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌’గా మథియాస్‌ లాఫ్టెస్‌నెస్‌ (ముంబై)... ‘బెస్ట్‌ లిబెరో’గా ప్రభాకరన్‌ (అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌)... ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌’గా జోయల్‌ బెంజమిన్‌ పురస్కారాలు గెల్చుకున్నారు.   

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)