Breaking News

BGT 2023: పుజారా ఖాతాలో చెత్త రికార్డు.. రెండో భారత బ్యాటర్‌గా!

Published on Sat, 02/18/2023 - 14:43

India vs Australia, 2nd Test- Cheteshwar Pujara: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా బ్యాటర్‌ ఛతేశ్వర్‌ పుజారా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. కెరీర్‌లో వందో టెస్టును మధుర జ్ఞాపకంగా మిగిల్చుకోవాలని భావించిన అతడిని దురదృష్టం వెక్కిరించింది. కాగా ఎన్నో ఎత్తుపళ్లాలు చూసిన పుజారాకు ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా వందో టెస్టు ఆడే అవకాశం వచ్చింది.

సముచిత గౌరవం
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరే క్రమంలో ఆసీస్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌కు ఎంపికైన పుజారా.. ఢిల్లీ మ్యాచ్‌ ద్వారా ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో సహచర ఆటగాళ్లు ‘గార్డ్‌ ఆఫ్‌ హానర్‌’ ద్వారా అతడికి సముచిత గౌరవం ఇచ్చారు.

అదే విధంగా బీసీసీఐ భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ చేతుల మీదుగా ఈ నయావాల్‌కు ప్రత్యేక క్యాప్‌ను అందించింది. ఇక పుజారా కెరీర్‌లో అరుదైన ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు అతడి కుటుంబం మొత్తం ఢిల్లీకి చేరుకుంది. అతడి బ్యాటింగ్‌ను చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూసింది.

రెండో భారత బ్యాటర్‌గా
కానీ వాళ్లతో పాటు అభిమానులను పుజారా నిరాశపరిచాడు. ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌కు వికెట్‌ సమర్పించుకుని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో పుజారా ఖాతాలో చెత్త రికార్డు చేరింది. టెస్టు క్రికెట్‌లో కొంతమందికి మాత్రమే లభించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నప్పటికీ (వందో టెస్టు).. కీలకమైన మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే అవుటైన ఎనిమిదో క్రికెటర్‌గా పుజారా నిలిచాడు. రెండో భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.

వందో టెస్టులో డకౌట్‌ అయిన క్రికెటర్లు వీరే
►దిలీప్‌ వెంగ్‌సర్కార్‌(ఇండియా)
►అలెన్‌ బోర్డర్‌ (ఆస్ట్రేలియా)
►కర్ట్నీ వాల్ష్ (వెస్టిండీస్‌)
►మార్క్‌ టేలర్‌(ఆస్ట్రేలియా)
►స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌(న్యూజిలాండ్‌)
►బ్రెండన్‌ మెకల్లమ్‌(న్యూజిలాండ్‌)
►అలిస్టర్‌ కుక్‌(ఇంగ్లండ్‌)
►ఛతేశ్వర్‌ పుజారా(ఇండియా)

చదవండి: IND vs AUS: చెత్త అంపైరింగ్‌.. కళ్లు కనిపించడం లేదా! కోహ్లిది నాటౌట్‌.. నో అంటున్నా..
బాగా ఆడితే మాకేంటి? ఛీ.. నీతో షేక్‌హ్యాండా? ఘోర అవమానం.. తగిన శాస్తే అంటున్న నెటిజన్లు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)