Breaking News

BGT: కోహ్లికి సాధ్యం కాలేదు.. పుజారా సాధించాడు! ‘తొలి బ్యాటర్‌’గా..

Published on Sat, 03/11/2023 - 13:47

India vs Australia, 4th Test- Cheteshwar Pujara Big Milestones:: టీమిండియా నయావాల్‌ ఛతేశ్వర్‌ పుజారా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు సందర్భంగా అరుదైన ఘనత సాధించాడు. పటిష్ట ఆస్ట్రేలియా జట్టు మీద టెస్టుల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు.

తన సమకాలీకులకు సాధ్యం కాని రీతిలో అందరి కంటే ముందే ఈ మైలురాయిని చేరుకున్న బ్యాటర్‌గా పుజారా ఘనత వహించాడు. ఆసీస్‌పై టెస్టుల్లో మెరుగైన రికార్డు కలిగిన భారత స్టార్‌ విరాట్‌ కోహ్లి ఇప్పటి వరకు 1793 పరుగులు చేయగా.. అతడి కంటే పుజారా 219 పరుగులు ముందంజలో నిలిచాడు. రన్‌మెషీన్‌ కోహ్లిని దాటి ఓవరాల్‌గా నాలుగో స్థానం ఆక్రమించాడు.

రోహిత్‌తో కలిసి సంయుక్తంగా
అంతేకాదు.. టెస్టుల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత బ్యాటర్‌గానూ పుజారా రికార్డులకెక్కాడు. మహ్మద్‌ అజారుద్దీన్‌ (33 ఇన్నింగ్స్‌) తర్వాత రోహిత్‌ శర్మ(36 ఇన్నింగ్స్‌)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో సచిన్‌ టెండుల్కర్‌(38), వీరేంద్ర సెహ్వాగ్‌(39), విరాట్‌ కోహ్లి(39), రాహుల్‌ ద్రవిడ్‌(41)లను పుజారా అధిగమించాడు.

1000 పరుగుల ఘనత
అదే విధంగా.. టెస్టుల్లో వరల్డ్‌ నంబర్‌ 1 ఆస్ట్రేలియా మీద సొంతగడ్డపై 1000 పరుగులు చేసుకున్న బ్యాటర్‌గానూ పుజారా ఘనత సాధించాడు. ఇక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ2023లో ఇప్పటి వరకు పుజారా మూడు టెస్టుల్లో నమోదు చేసిన స్కోర్లు 7,0,31 నాటౌట్‌, 59.

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లు(ఇప్పటి వరకు)
సచిన్‌ టెండుల్కర్‌- 34 మ్యాచ్‌లలో 3262 పరుగులు
వీవీఎస్‌ లక్ష్మణ్‌- 29 మ్యాచ్‌లలో 2434 పరుగులు
రాహుల్‌ ద్రవిడ్‌- 32 మ్యాచ్‌లలో 2143 పరుగులు
ఛతేశ్వర్‌ పుజారా- 24 మ్యాచ్‌లలో 2012 పరుగులు(ఇన్నింగ్స్‌ కొనసాగుతోంది)
విరాట్‌ కోహ్లి- 24 మ్యాచ్‌లలో 1793 పరుగులు.

ఇక ఇప్పటి వరకు బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో సచిన్‌, లక్ష్మణ్‌, ద్రవిడ్‌ అత్యుత్తమ స్కోర్లు వరుసగా.. 241 నాటౌట్‌, 281, 233 కాగా.. పుజారా 204, కోహ్లి 169 పరుగులు చేశారు.
చదవండి: NZ Vs SL: డ్రా అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్‌
Gambhir- Afridi: గంభీర్‌ దగ్గరికి వచ్చి ఆఫ్రిది ఆరా.. వీడియో వైరల్‌! ఫ్యాన్స్‌ ఏమన్నారంటే!

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)